Pallavi Prashanth: బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా నిలిచి పల్లవి ప్రశాంత్ బాగా పాపులర్ అయ్యాడు. మొన్నటి వరకు ప్రశాంత్ బిగ్ బాస్ ఆడియన్స్ కి మాత్రమే తెలుసు. కానీ ఫినాలే తర్వాత జరిగిన రచ్చ కారణంగా ప్రశాంత్ అరెస్ట్ అయ్యాడు. దీంతో దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాడు. ఈ ఇష్యూతో మరింత ఫేమస్ అయ్యాడు పల్లవి ప్రశాంత్. కోర్టు ప్రశాంత్ కి 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే రెండు రోజుల తర్వాత ప్రశాంత్ కు కండిషన్స్ తో కూడిన బెయిల్ దొరికింది.
నిన్న ప్రశాంత్ జైలు నుంచి బయటకు వచ్చాడు. దీంతో అభిమానులు జైలు ముందు అతన్ని చూడటం కోసం ఎదురు చూశారు. ఈ క్రమంలో ఓ చిన్నారి ప్రశాంత్ ను చూసేందుకు జైలు వద్దకు వచ్చింది. నాలుగేళ్ల పాప ప్రశాంత్ మామను చూడటానికి వచ్చానని .. ప్రశాంత్ మామ కోసం రెండు చాక్లెట్లు తెచ్చాను. బయటకు రాగానే ఇస్తాను అని చెప్పింది. ప్రశాంత్ మామ కోసమే ఇక్కడికి వచ్చాను అని చెప్పిన చిన్నారి మాటలు అందరి మనసులు దోచేశాయి.
ప్రశాంత్ ని అరెస్ట్ చేసిన విషయం తెలిసి, చిన్నారికి జ్వరం కూడా వచ్చిందట. అయినా వాళ్ళ అమ్మ, అమ్మమ్మతో కలిసి జైలుకు వరకు వచ్చిందట. మామను చూడాలని వెక్కి వెక్కి ఏడ్చిందట. ప్రస్తుతం చిన్నారి మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రశాంత్ రాగానే తన ఆనందం చూడాలంటున్నారు కుటుంబీకులు.
ఇక పల్లవి ప్రశాంత్ అరెస్ట్ పై సీజన్ 7 కంటెస్టెంట్స్ అతనికి మద్దతుగా నిలుస్తున్నారు. అతను అమాయకుడు అని చెప్పుకొచ్చారు. శివాజీ, యావర్, భోలే, అశ్విని, శోభా శెట్టి అందరూ ప్రశాంత్ అరెస్ట్ పై స్పందించారు. ప్రశాంత్ అభిమానులు కూడా ఆందోళన చెందారు. మరో వైపు అతన్ని బయటకు తెచ్చేందుకు కుటుంబ సభ్యులతో పాటు అతని అభిమానులు ప్రయత్నాలు చేశారు. ఎట్టకేలకు ప్రశాంత్ కు ఉపశమనం లభించింది.