
దేశంలో కరోనా ఎంట్రీతో కేంద్రం లాక్డౌన్ కొనసాగిస్తున్న సంగతి తెల్సిందే. తొలి విడుదల లాక్డౌన్ ముగియగా రెండో విడుత లాక్డౌన్ మే 3వరకు కొనసాగుతుందని ప్రధాని మోదీ ప్రకటించారు. దీంతో సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అంతా ఇళ్లకే పరిమితమయ్యారు. కరోనాపై సెలబ్రెటీలంతా వారుతోచిన విధంగా సోషల్ మీడియాలో అవగాహన కల్పిస్తున్నారు. తాజాగా ప్రముఖ తమిళ నటుడు, జానపద గాయకుడు పుష్పవనం కుమార్తె పల్లవి అగర్వాల్ సోషల్ మీడియాలో హాట్ కామెంట్ చేసింది. ఆమె చేసిన సెటైరికల్ కామెంట్ అందరినీ ఆకట్టుకుంటోంది.
పల్లవి అగర్వాల్ డాక్టర్ గా సేవలందిస్తోంది. ప్రస్తుతం వైద్యులందరూ ముందుండి కరోనాపై పోరాడుతున్నారు. కరోనా బాధితులకు సేవలందించడంతోనే వారి డ్యూటీ ముగిస్తుంది. ఇక మిగతా పేషంట్లను పట్టించుకునే పరిస్థితులు ఏమాత్రం కనిపించడం లేదు. ఈ విషయాలను రోజు గమనిస్తున్న డాక్టర్ పల్లవి ఒక విషయంలో సైటరికల్ గా కామెంట్ చేయడం ఆసక్తిని రేపుతోంది. ‘స్టే హోమ్.. స్టే సేఫ్.. ప్రేమను పొందండి.. పిల్లల్ని కాదు.. ఆసుపత్రుల్లో గర్భవతుల తాకిడి ఎక్కువవుతోంది..’ అంటూ తన ఫేస్ బుక్ లో పోస్టు చేసింది.
లాక్డౌన్ సమయంలో దంపతులకు ఎక్కువగా సమయం దొరకడంతో వారు రొమాన్స్ లో మునిగిపోతున్నారు. దీంతో ఆస్పత్రులకు గర్భవతుల తాకిడి పెరిగిపోతుందనే ఉద్దేశ్యంతో పల్లవి ఈ పోస్టు చేసినట్లు తెలుస్తోంది. కరోనా టైంలో రోమాన్స్ తగ్గించుకుంటే మంచిదనే అభిప్రాయాన్ని ఆమె సెటైరికల్ గా చెప్పడంపై నెటిజన్లు ఫిదా అవుతున్నారు.