Palak Muchhal: బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని కొల్లగొడుతూ మార్కెట్ ని పెంచుకోవడం మాత్రమే సెలబ్రిటీల లక్ష్యం కాదు. తమని ఈ స్థాయిలో నిలబెట్టిన ప్రేక్షక దేవుళ్ళకు ఎదో ఒక మంచి చెయ్యాలి అనే తపన ఉండాలి. అలాంటి తపన ఉన్న సెలబ్రిటీలు మన ఇండస్ట్రీ లో చాలా తక్కువ మంది ఉంటారు. ఆ తక్కువ మందిలో ఒకరు సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu). తానూ సంపాదించే డబ్బులతో ఎవరికీ తెలియకుండా, చిన్నారులకు 3 వేలకు పైగా గుండె ఆపరేషన్స్ చేయించిన మహోన్నతమైన మనస్తత్వం సూపర్ స్టార్ మహేష్ బాబు సొంతం. ఇది కేవలం బయటకు తెలిసిన సహాయం మాత్రమే. ఎవరికీ తెలియకుండా ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. వాటి గురించి ఆయన ఎప్పుడు కూడా పబ్లిసిటీ చేసుకోలేదు. ఈ కాలం లో ఇలా ఎంతమంది ఉంటారు చెప్పండి. అయితే మహేష్ బాబు మానవత్వానికి పోటీగా ఒక సింగర్ వచ్చింది.
ఈమె ఏకంగా 3800 మంది చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కింది. ఆ సింగర్ పేరు పలక్ ముచ్చల్(Palak Muchhal). సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే ఆయనకు కోట్లలో రెమ్యూనరేషన్ వస్తుంది. కేవలం ఒక్క యాడ్ లో నటిస్తేనే ఆయనకు 20 నుండి 30 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ వస్తుంది. సింగర్స్ కి ఆ రేంజ్ రెమ్యూనరేషన్ ఎక్కడి నుండి వస్తుంది చెప్పండి?, పైగా ఈమె టాప్ మోస్ట్ సింగర్ కూడా కాదు. పాటకు ఇంత అని డబ్బులు తీసుకుంటూ ఉంటారు. అలాంటి ఆమె తనకు వచ్చే డబ్బులతో 3800 మంది చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయించడం అంటే మాటలా చెప్పండి?, ఎంత మందికి ఉంటుంది ఇలాంటి మనసు?. కేవలం తన రెమ్యూనరేషన్ ద్వారా వచ్చే డబ్బులు మాత్రమే కాదు, ఈమె ఇలాంటి పిల్లల కోసం ప్రత్యేకంగా లైవ్ కన్సర్ట్స్ ని ఏర్పాటు చేసి, తద్వారా వచ్చే విరాళాలు సేకరించి చిన్నారుల పాలిట దేవత లాగా నిల్చింది.
ఇలాంటి వాళ్లనే మనిషి రూపం లో ఉన్న దేవుళ్ళు అని అంటుంటారు పెద్దలు. వీళ్లకు చేతులెత్తి దండం పెట్టినా తక్కువే అవుతుంది. పలక్ ముచ్చల్ బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు పాటలు పాడింది. మన టాలీవుడ్ లో ఈమె బాహుబలి : ది బిగినింగ్, రుద్రమ దేవి వంటి సినిమాలకు పాటలు పాడింది. ఇప్పటికీ ఈమె బాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉన్న సింగర్ గా కొనసాగుతోంది. ఈమె లైవ్ మ్యూజిక్ కన్సర్ట్స్ కి ఫ్యాన్స్ ఎక్కువ. అందుకే దీనిని చిన్న పిల్లల ప్రాణాలను కాపాడడం కోసం ఉపయోగిస్తోంది. ఆమెకు ఉన్న ఈ విశాలమైన హృదయాన్ని చూసి సోషల్ మీడియా లో నెటిజెన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.