https://oktelugu.com/

Pakka Commercial Release Date Fixed: జులై 1న గోపీచంద్ నిలబడగలడా ?

Pakka Commercial Release Date Fixed: హీరో గోపీచంద్ కి ఎలాగైనా హిట్ సినిమా ఇవ్వాలనే కసితో తన క్రియేటివిటీని అంతా గుమ్మరిస్తూ సినిమా చేస్తున్నాడు మారుతి. కాగా డిఫరెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ ప్రమోషన్స్ చేస్తూ తమ కలయికలో వస్తున్న “పక్కా కమర్షియల్ ” సినిమా పై మొత్తానికి ఇంట్రెస్ట్ ను పెంచుతున్నాడు. కాగా తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. జులై 1వ తేదీన ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ […]

Written By:
  • Shiva
  • , Updated On : March 30, 2022 / 05:41 PM IST
    Follow us on

    Pakka Commercial Release Date Fixed: హీరో గోపీచంద్ కి ఎలాగైనా హిట్ సినిమా ఇవ్వాలనే కసితో తన క్రియేటివిటీని అంతా గుమ్మరిస్తూ సినిమా చేస్తున్నాడు మారుతి. కాగా డిఫరెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ ప్రమోషన్స్ చేస్తూ తమ కలయికలో వస్తున్న “పక్కా కమర్షియల్ ” సినిమా పై మొత్తానికి ఇంట్రెస్ట్ ను పెంచుతున్నాడు. కాగా తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. జులై 1వ తేదీన ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

    Pakka Commercial Release Date Fixed

    ఇక గోపిచంద్ సరసన హీరోయిన్ గా రాశీఖన్నా నటిస్తోంది. అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌-యూవీ క్రియేషన్స్‌ బ్యానర్లపై బన్నీవాసు ఈ మూవీని నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. ఈ సినిమా కోసమే మారుతి ‘పక్కా కమర్షియల్’ గా స్క్రిప్ట్ రాశాడట. మారుతి నుండి మాత్రం మినిమం గ్యారంటీ మూవీని ఆశించొచ్చు,

    Also Read: Yadadri Special Mini Buses: తెలంగాణ ‘తిరుపతి’ యాదాద్రికి చేరడం ఇక ఈజీ..

    ఇప్పటికే మారుతి ఈ సినిమా విషయంలో వినోదం తప్పకుండా ఉంటుందని భరోసా ఇచ్చాడు. అయినా అల్లు అరవింద్ కంపెనీ నుండి సినిమా వస్తుందంటే చెప్పాల్సిన పనే లేదు. కాబట్టి ఈ సారి గోపీచంద్ కి మంచి విజయం దక్కుతుందని అనుకోవచ్చు. కాకపోతే, హీరో గోపీచంద్ కెరీర్ ప్రస్తుతం డైలమాలో ఉంది. వరుస పరాజయాలతో విసిగిపోయాడు.

    Pakka Commercial Release Date Fixed

    గోపీచంద్ హీరోగా సీజన్ కి ఒకటి చొప్పున సినిమా రిలీజ్ చేసినా విజయం మాత్రం అందుకోలేకపోతున్నాడు. అందుకే, ఈ సినిమా మార్కెట్ పై డౌట్ గా ఉన్నారు మేకర్స్. పైగా ఈ సినిమాతో పాటు మిగిలిన పెద్ద సినిమాలు కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. మరి ఈ పోటీలో గోపీచంద్ నిలబడగలడా ?

    Also Read: Tollywood Heroes Wives: టాలీవుడ్ సెల‌బ్రిటీల‌కు పోటీగా సంప‌దిస్తున్న వారి భార్య‌లు వీరే.. టాప్‌లో ఆమెనే.

    Tags