Yadadri Special Mini Buses: యాదాద్రిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఉప్పల్ నుంచి యాదగిరికి వంద బస్సులు కేటాయించి తన భక్తిని చాటుకున్నారు. దీంతో ప్రజలకు దేవాలయ సందర్శన మరింత సులభం కానుంది. రోజు వంద మినీ బస్సులు యాదాద్రి చుట్టి రానున్నాయి. దీంతో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే యాదాద్రి పుణ్యక్షేత్రం దివ్యక్షేత్రంగా వర్థిల్లే క్రమంలో సీఎం కేసీఆర్ అనేక చర్యలకు శ్రీకారం చుడుతున్నట్లు తెలుస్తోంది. దీని కోసం ఇంకా ఏం కార్యక్రమాలు చేపడతారోనని భక్తులు చూస్తున్నారు.
భక్తుల తాకిడిని ముందే ఊహించి కేసీఆర్ ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఆరేళ్ల తరువాత ఆలయం ప్రారంభం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో విచ్చే సే అవకాశముందని భావిస్తున్నారు. దీంతో బస్సుల సంఖ్య పెంచుతున్నారు. యాదాద్రి అద్భుతాలను వీక్షించేందుకు భక్తులు బారులు తీరనున్నట్లు అందుతున్న సమాచారం మేరకే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
Also Read: Increased Employment Guarantee Wage Rates : ‘ఉపాధి’కి మార్గం చూపిన కేంద్రం.. ఇక త్వరపడండి
జేబీఎస్ నుంచి అయితే రూ. 100 లు, ఉప్పల్ నుంచి అయితే రూ.75 లు చార్జీగా నిర్ణయించారు. దీంతో భక్తులు ఎక్కడ కూడా ఇబ్బందులు పడకుండా యాదాద్రి చేరుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కొండ కింద ఉన్న పుష్కరిణిలో స్నానాలు ఆచరిస్తున్నారు. ఫోన్ నెంబర్, ఆధార్ నెంబర్ ఆధారంగా టోకెన్టు ఇస్తున్నారు. దీంతో స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు వేల సంఖ్యలో వచ్చేస్తారని తెలుస్తోంది.
ఇటీవల పున:ప్రారంభమైన ఆలయంలో అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఆలయ నిర్మాణంలో కేసీఆర్ ప్రత్యేక చొరవ చూపారు. ఆలయ విశిష్టత, నిర్మాణ పనులు దగ్గరుండి చూసుకున్నారు. ఆలయానికి యాదాద్రి అని నామకరణం చేసిన చినజీయర్ స్వామి మాత్రం ఆలయంలోకి రావడం లేదు. దీంతో భక్తుల్లో అనుమానాలు వస్తున్నా ఇక అంతే సంగతి అని తెలుస్తోంది. దీంతో ఆలయ సందర్శనకు భక్తులు ఆరేళ్లుగా వేచి చూస్తున్నందున ఒక్కసారిగా పోటెత్తే అవకాశాలున్నాయని కేసీఆర్ ఊహించి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయించారు.
Also Read: Red Chilli Record Price: రైతు పంట పండింది.. ఎర్రబంగారానికి కాసుల వర్షం.. క్వింటాల్ రూ.52వేలు