Prabhas-Hanu movie : యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ రీసెంట్ గానే సీతారామం డైరెక్టర్ హను రాఘవపూడి తో ఒక సినిమాని ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం ఓపెనింగ్ లో ప్రభాస్ తర్వాత సోషల్ మీడియా లో ఎక్కువగా ట్రెండింగ్ అవుతున్న బ్యూటీ ఇమాన్ ఇస్మాయిల్. ఈమె ఈ చిత్రం ద్వారా టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయం అవుతుంది. ఇంస్టాగ్రామ్ లో సెలబ్రిటీ అయితే బిగ్ బాస్ లో అవకాశాలు సంపాదించే మోడల్స్ ఉన్న ఈరోజుల్లో, ఇమాన్ ఏకంగా ప్రభాస్ లాంటి పాన్ ఇండియన్ సూపర్ స్టార్ చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం కొట్టేసింది. ఈ సినిమా హిట్ అయితే ఇమాన్ ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోతుంది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.
అయితే ఈ సినిమా గురించి మరో ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. అదేమిటంటే ఈ చిత్రం లో సెకండ్ హీరోయిన్ రోల్ కి స్కోప్ ఉందట. ఆ పాత్ర కోసం కూడా కొత్త ముఖాన్ని టాలీవుడ్ కి పరిచయం చెయ్యాలని అనుకుంటున్నాడు డైరెక్టర్ హను. పాకిస్థాన్ లో పాపులర్ నటిగా పేరు తెచ్చుకున్న సజల్ అలయ్ ని ఈ చిత్రం లో ముఖ్యమైన పాత్ర కోసం తీసుకొస్తున్నారట. ఇలా ఇద్దరు ముస్లిం యువతులను తీసుకొని రావడం లో హను ఉద్దేశ్యం ఏమిటంటే, ఈ సినిమా రజాకార్ ఉద్యమం జరుగుతున్న సమయంలో ఒక ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ కి, పాకిస్థాన్ అమ్మాయికి మధ్య జరుగుతున్న లవ్ స్టోరీ కాబట్టి, అందుకు ముస్లిమ్స్ అవసరం కాబట్టి వారినే తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. గుండెల్ని పిండేసే ప్రేమ కథ గా, ఎంతో ఎమోషనల్ గా ఈ సినిమా ఉంటుందట. హను గత సినిమా సీతారామం కూడా ఇలాగే ఉంటుంది. ఆ సినిమా క్లైమాక్స్ ని చూసి ఏడవని వారంటూ ఎవ్వరూ ఉండరేమో. ఎమోషనల్ సన్నివేశాల్లో అద్భుతంగా రాణించే ప్రభాస్, ఈ సినిమాలో ఏ రేంజ్ పెర్ఫార్మన్స్ ఇవ్వగలడో ఊహించుకోవచ్చు.
మరి ప్రభాస్ కి ఇప్పుడున్న యాక్షన్ హీరో ఇమేజి కి ఇలాంటి సున్నితమైన కథలు సరిపోతాయా లేదా అనేది చూడాలి. ఎందుకంటే ఆయన హీరోగా తెరకెక్కిన రాధే శ్యామ్ చిత్రం పర్వాలేదు అనే రేంజ్ లో ఉన్నప్పటికీ కూడా, ప్రభాస్ కి ఉన్న యాక్షన్ హీరో ఇమేజి కారణంగా భారీ డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఇప్పుడు ఆయన వరుసగా ‘సలార్’, ‘కల్కి’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ తో మంచి ఊపు మీద ఉన్నారు. ప్రభాస్ అభిమానులు ఆయన నుండి మరో ఊర మాస్ క్యారక్టర్ చెయ్యాలని కోరుకుంటున్నారు. మరి హను ఈ ప్రేమ కథని ఎలా మలచబోతున్నాడు అనేది టీజర్ వచ్చే వరకు సస్పెన్స్. వచ్చే నెలలోనే ఈ సినిమాకి సంబంధించిన మొదటి షెడ్యూల్ ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు మైత్రీ మూవీ మేకర్స్.