Homeఎంటర్టైన్మెంట్Padma Shri To Mogulayya: ఒకప్పుడు తినడానికి లేదు.. ఇప్పుడు పద్మ శ్రీ.. మొగిలయ్య కష్టం...

Padma Shri To Mogulayya: ఒకప్పుడు తినడానికి లేదు.. ఇప్పుడు పద్మ శ్రీ.. మొగిలయ్య కష్టం అంతా ఇంతా కాదు

Padma Shri To Mogulayya: ఆయనో గొప్ప కళాకారుడు.. కళ కళ కోసం కాదు.. ప్రజల కోసం ప్రజలను చైతన్య పరచడం కోసం అన్న వాక్యాలను ఆదర్శంగా తీసుకున్నఆయన గ్రామ గ్రామాన తిరిగి కిన్నెర వాయిద్యంతో తిరిగి ప్రజలను ఆకట్టుకున్నాడు. పూట గడవని స్థితిలో ఉన్నా ఆయన కళ కోసం పరితపిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఆయనే కిన్నెరమెట్ల మొగిలయ్య అలియాస్ దర్శనం మొగిలయ్య. తెలంగాణ సర్కారు ఆయన ప్రతిభను గుర్తించి సత్కారాలు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకుగాను పాసు ఇచ్చింది. ఇకపోతే ఇటీవల ఆయన తెలుగు సినిమాలోనూ పాట పాడారు. తద్వారా ఆయనకు మరింత పేరు కూడా వచ్చింది. తాజాగా కేంద్రప్రభుత్వం కూడా ఆయన ప్రతిభను గుర్తించింది. అత్యున్నత పురస్కారమైన పద్మశ్రీని ప్రకటించింది.

Padma Shri To Mogulayya
Padma Shri To Mogulayya

నల్లమల ముద్దు బిడ్డ… కిన్నెరమెట్ల మొగిలయ్య అలియాస్ దర్శనం మొగిలయ్యకు పురస్కారం లభించడం పట్ల తెలుగు ప్రజలు సంతోషపడుతున్నారు. తెలంగాణలోని నాగర్‌ కర్నూల్‌ జిల్లా అవుసలికుంటకు చెందిన మొగిలయ్య..ప్రజా కళాకారుడిగా పేరు తెచ్చుకున్నారు. తెలకపల్లి మండలం గుట్టరాయిపాకులలో పుట్టిన మొగిలయ్య.. తన తాత, తండ్రి నుంచి కిన్నెరవాయిద్యం నేర్చుకున్నారు. ఈ కళ అంతరించపోకుండా ఉండేందుకుగాను తనవంతు కృషి చేస్తున్నాడు. 12 మెట్ల కిన్నెర కళను నమ్ముకుని జీవనం సాగిస్తున్న మొగిలయ్య ప్రతిభకు ఇటువంటి గౌరవం లభించడం పట్ల అందరూ ఆనందపడిపోతున్నారు. కేంద్రప్రభుత్వం అరుదైన కళాకారుడికి అరుదైన గౌరవం ఇచ్చిందని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడుతున్నారు.

Also Read: ప్రవచన కారుడికి పద్మ శ్రీ.. అలుపెరగని గళానికి అరుదైన గౌరవం..

కిన్నెర వాయిద్య కళను స్కూల్స్‌తో పాటు ఇతర వేదికలపైన ప్రదర్శిస్తూ మొగిలయ్య ముందుకు సాగుతున్నాడు. తనకు ఇంతటి అరుదైన గౌరవం లభించడం పట్ల మొగిలయ్య సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. తననుఎంపిక చేసిన భారత ప్రభుత్వానికి, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

మొగిలయ్య జనసేనాని పవన్ కల్యాణ్ చిత్రం ‘భీమ్లా నాయక్’ లో ఓ పాట పాడి బాగా ఫేమస్ అయ్యారు. సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న ఈ చిత్రంలో కిన్నెరమెట్ల మొగిలయ్య పాడిన పాట యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. ఈ పిక్చర్‌కు మాటల మాంత్రికుడు, పవన్ కల్యాణ్ ఫ్రెండ్ అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఎస్.ఎస్.థమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.

Also Read: ఆశ్చర్యపరిచిన మోడీ.. బిపిన్ కు పద్మ విభూషణ్.. సుందర్ పిచయ్, సత్యనాదెళ్లకు పద్మ భూషణ్

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
RELATED ARTICLES

Most Popular