Nandamuri Balakrishna: బాలయ్యకు ప్రేక్షకులకు గత ఏడాది వరకు తెలియని గ్యాప్ ఉండేది. అందుకే, బాలయ్య సినిమాలను ప్రేక్షకుల్లో చాలామంది చూసే వాళ్ళు కాదు. కానీ, ఆహాలో చేస్తోన్న ‘అన్స్టాపబుల్’ షో నుంచి బాలయ్య అంటే ఏమిటో ? అసలు బాలయ్య బయట ఎలా ఉంటారో ? చాలా క్లారిటీగా జనానికి అర్థం అయింది. ఇంత ఓపెన్ గా ఏ హీరో ఉండదు కదా. ఒక్క బాలయ్య మాత్రమే ఇలా ఎలా ఉండగలుగుతున్నారు ? అనే భావం అందరిలో బలంగా నాటుకుపోయింది.

అలా బాలయ్యను ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. బాలయ్య స్పీచ్ లను ఎగతాళి చేయకుండా అర్థం చేసుకోవడం మొదలు పెట్టారు. అప్పటికీ గానీ, బాలయ్యలోని గొప్పతనం, బాలయ్యలోని మంచి తనం జనానికి అర్ధం కాలేదు. ఏది ఏమైనా బాలయ్య ఎప్పటికీ చిన్న పిల్లాడే. చిన్న పిల్లాడు అంటే.. ఏది పడితే అది చేసేవాడు కాదు అర్ధం. స్వచమైన మనసు ఉన్న వాడు అని.
ఇక నిన్న అఖండ ఆడియో ఫంక్షన్ లో బాలయ్య మాటల్లోని అర్ధాలను తెలుసుకుని నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. బాలయ్య స్పీచ్ లో ఇంత డెప్త్ ఉంటుందా ? ఇన్నాళ్లు సరిగ్గా వినలేదు గాని, బాలయ్యలో చాలా లోతు అయినా ఎమోషన్ ఉంది అని జనం నమ్ముతున్నారు. ఇక బాలయ్య భక్తి ఛానల్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పడం విశేషం.
Also Read: ఎన్టీఆర్ అటు బాలయ్య ఇటు… మెగా ఫ్యామిలీతో నందమూరి బంధం భలే ఉందే!
బాలయ్య మాటల మధ్యలో భక్తి ఛానల్ ని తీసుకొచ్చారని అనుకోవాడనికి లేదు. ఎందుకంటే బాలయ్యకి భక్తి గురించి, మంత్రాల గురించి బాగా తెలుసు. మరి నిజంగానే బాలయ్య త్వరలో ఓ భక్తి ఛానల్ ప్రారంభించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. బాలయ్య భక్తి గురించి సరదాగా అని ఉండొచ్చు. కానీ, బాలయ్య భక్తి విషయంలో మాత్రం ఎప్పుడు సీరియసే.
చిన్న తనం నుంచే బాలయ్యకు భక్తి శ్రద్ధలు ఎక్కువ. అందుకే, చిన్న వయసులోనే పురాణాల గురించి, పద్యాల గురించి బాగా చదువుకున్నారు. ముఖ్యంగా శాస్త్రాలను బాగా అర్థం చేసుకున్నారు. ఎక్కువ తెలిస్తే.. ఎక్కువుగా వర్ణిస్తుంటాం. ఆ వర్ణన జనానికి బోర్ కొడుతోంది. బాలయ్య విషయంలో కూడా ఇన్నాళ్లు అదే జరిగింది. మరి ఇక నుంచైనా బాలయ్య చెప్పే శ్లోకాలను సీరియస్ గా తీసుకుని వాటి అర్థాలు తెలుసుకోవాలని ఆశిద్దాం.
Also Read: ‘అన్స్టాపబుల్’ జోరుతో మరో సరికొత్త షోకు బాలయ్య శ్రీకారం