Thaman: తమన్.. ప్రస్తుతం తెలుగులో టాప్ మ్యూజిక్ డైరెక్టర్. పైగా చాలా సైలెంట్. మహేష్, బన్నీ, ఎన్టీఆర్ సినిమాల ఆడియో ఫంక్షన్స్ లో కూడా పెద్దగా మాట్లాడటానికి ఇష్టపడేవాడు కాదు. తన సాంగ్స్ రికార్డ్స్ క్రియేట్ చేసినా తమన్ ఎప్పుడు ఓపెన్ అవ్వలేదు. మరి అలాంటి తమన్ కి నిన్న ఏమైంది ? ఎప్పుడు లేనిది నిన్న అలా ఎలా మాట్లాడాడు ? ఇదే అడుగుతున్నారు ఇండస్ట్రీలో ఇప్పుడు. తమన్ కి బాలయ్య సినిమా గురించి ఆ రేంజ్ లో చెప్పాల్సిన అవసరం లేదు. కానీ తమన్ ఓ రేంజ్ లో చెప్పాడు.

ఒక విధంగా తమన్ స్పీచ్ బన్నీ, బాలయ్య స్పీచ్ కంటే క్రేజ్ తెచ్చుకుంది. అలాగే అఖండ పై తమన్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ బూస్టప్ బాగా పనిచేస్తోంది. ఇంతకీ తమన్ ఏమి మాట్లాడాడు, ఆ మాటలు వెనుక ఉన్న అర్థం ఏమిటో చూద్దాం. ‘అఖండ సినిమాలో 70 సీన్లు ఉన్నాయి. అయితే, ఆ 70 సీన్స్ లో మీరు 50 సీన్లు నిలబడే చూస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు’, ఈ మాట అనడం మామూలు విషయం కాదు.
అసలు థియేటర్లో ఎవరూ కూర్చోరు, అంత గొప్పగా సినిమా ఉంటుంది అనడం అతిశయోక్తే. ఇలాంటి మాటలు హీరోలు, దర్శకులు చెబుతూ ఉంటారు. అభిమానులకు ఊపు తీసుకురావడానికి. కానీ ఈ సారి తమన్ చెప్పాడు. తమన్ గతంలో ఎన్నడూ ఇలా చెప్పలేదు. కానీ బాలయ్య సినిమా కోసం చెప్పాడు. పైగా తమన్ ఎమోషనల్ అయ్యాడు. ఏడాదిన్నరగా శివుడి ట్రాన్స్‌లో ఉన్నాను అని చెప్పాడు.
Also Read: సిరివెన్నెల ఆరోగ్యంపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవం
నిజంగానే అఖండ సినిమా తమన్ కి అంత బాగా నచ్చిందా ? అఖండకి రీ రికార్డింగ్ పూర్తి చేసి, నేరుగా బాలకృష్ణ గారి ఇంటికి వెళ్లి, ఆయన ఆశీర్వాదం తీసుకోవాలనిపించింది అని కూడా చెప్పడం విశేషం. ఒక విధంగా తమన్ బాలయ్య పై ప్రత్యేక అభిమానాన్ని చూపించాడు. చిరంజీవి, మహేష్, ఎన్టీఆర్, బన్నీ లాంటి హీరోల మీద కూడా తమన్ ఎప్పుడు ఇంత అభిమానాన్ని చూపించలేదు.
ఒక్క బాలయ్య మీద మాత్రం తమన్ ప్రత్యేక అభిమానాన్ని చూపించాడు. అయితే, ఆ అభిమానం వెనుక ‘మా సామాజిక వర్గం’ అనే ఫీలింగ్ ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అదే నిజం అనుకుంటే, మహేష్, ఎన్టీఆర్ లను కూడా అలాగే పొగడాలి కదా. కానీ ఒక్క బాలయ్య విషయంలోనే తమన్ ఇలా మాట్లాడాడు. కాబట్టి, తమన్ కి అఖండ నిజంగానే నచ్చింది అనుకోవచ్చు.
ఇక పనిలో పనిగా తమన్ మరో మాట కూడా అన్నాడు. బాలయ్య మా తెలుగు సినిమా ఇండ్రస్ట్రీకి శివుడు లాంటివారు. ఈ మాట వెనుక అర్ధం బాలయ్య క్యారెక్టర్ గురించి చెప్పడం ఏమో. ఏది ఏమైనా అఖండ సినిమా నా మైండ్ లో బాగా దిగిపోయింది అంటూ తమన్ చెప్పుకోవడం విశేషమే.