https://oktelugu.com/

మున్నాళ్ల ముచ్చటగా మన తారల పెళ్లిళ్లు..!

సెలబ్రెటీల పెళ్లిళ్లు మున్నాళ్ల ముచ్చటగా మిగిలిపోతున్నాయి. పట్టుమని పదిరోజులు కూడా కాపురం చేయకుండానే వారిమధ్య గొడవలు చోటు చేసుకుంటున్నాయి. ఎవరికీవారు సర్దుకుపోకుండా.. వాదనలు పెంచుకుంటూ పోతున్నారు. దీంతో ఇటీవల కాలంలో విడిపోతున్న సెలబెట్రీల సంఖ్య భారీగా పెరిగిపోతూ పోతుంది. అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంటున్న సినీ సెలబ్రెటీలు కొద్దిరోజుల్లోనే విడిపోతుండటంపై శోచనీయంగా మారింది. కొద్దినెలల క్రితం హీరోయిన్ అమలాపాల్ విడాకులు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. హీరోయిన్ అమలాపాల్ దర్శకుడు ఎల్.ఎల్. విజయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకొంది. […]

Written By:
  • NARESH
  • , Updated On : September 1, 2020 12:37 pm
    Follow us on

    సెలబ్రెటీల పెళ్లిళ్లు మున్నాళ్ల ముచ్చటగా మిగిలిపోతున్నాయి. పట్టుమని పదిరోజులు కూడా కాపురం చేయకుండానే వారిమధ్య గొడవలు చోటు చేసుకుంటున్నాయి. ఎవరికీవారు సర్దుకుపోకుండా.. వాదనలు పెంచుకుంటూ పోతున్నారు. దీంతో ఇటీవల కాలంలో విడిపోతున్న సెలబెట్రీల సంఖ్య భారీగా పెరిగిపోతూ పోతుంది.

    అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంటున్న సినీ సెలబ్రెటీలు కొద్దిరోజుల్లోనే విడిపోతుండటంపై శోచనీయంగా మారింది. కొద్దినెలల క్రితం హీరోయిన్ అమలాపాల్ విడాకులు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. హీరోయిన్ అమలాపాల్ దర్శకుడు ఎల్.ఎల్. విజయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకొంది. అయితే కొద్దిరోజుల్లో వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. రెండేళ్లు వీరిద్దరి సంసారం సజావుగానే సాగిన తర్వాత వీరిమధ్య గొడవలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత విజయ్ రెండో పెళ్లి చేసుకోగా అమలాపాల్ సినిమాలతో బీజీగా మారిపోయింది.

    తాజాగా మరో హీరోయిన్ ఎస్తేర్ విడాకులు తీసుకున్నట్లు ప్రకటించి అందినీ షాక్ గురిచేసింది. గతేడాది క్రితమే హీరోయిన్ ఎస్తేర్, సింగర్ నోయల్ ను పెళ్లి చేసుకుంది. వీరిద్దరి ప్రేమ వివాహం కావడం విశేషం. గతేడాది జనవరి 3న మంగళూరులో గ్రాండ్ గా వివాహం జరిగింది. ఈ పెళ్లికి దర్శక దిగ్గజం రాజమౌళి సైతం హాజరై దంపతులను ఆశీర్వదించారు. అయితే పెళ్లయిన మరుసటి రోజు నుంచి వీరిమధ్య గొడవలు జరిగినట్లు తెలుస్తోంది.

    దీంతో వీరిద్దరు పట్టుమని పదిరోజులు కూడా కాపురం చేయకుండానే దూరంగా ఉంటున్నారట. కొన్నినెలలుగా వీరిద్దరు దూరంగా ఉంటుండటంతో వీరిద్దరు విడాకులు తీసుకున్నారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే దీనిపై వీరిద్దరు పెద్దగా స్పందించలేదు. తాజాగా వీరిద్దరికి కోర్టు విడాకులు మంజూరు చేసిందని ఎస్తేరు వెల్లడించింది. తాను చాలా విషయాల్లో సూటిగా, నిజాయితీగా ఉంటానని.. అయితే విడాకుల విషయంలో ఇంతకంటే ఎక్కువగా స్పందించ దలుచుకోలేదని ఎస్తేర్ చెప్పింది.

    ఇదిలా ఉంటే ఎస్తేర్ తెలుగులో ‘వెయ్యి అబ్దద్దాలు’ మూవీతో పరిచమైంది. సునిల్ హీరోగా నటించిన భీమవరం బుల్లోడు మూవీతో ఎస్తేర్ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం తమిళ, మరాఠీ సినిమాల్లో నటిస్తున్న ఎస్తేర్ కేవలం ఐదునెలల వ్యవధిలో విడాకులు తీసుకోవడంపై పలువురు పెదవి విరుస్తున్నారు. తారల పెళ్లిళ్లు పట్టుమని పదికాలలపాటు ఎందుకు సాఫీ జరుగడం లేదని చర్చ ప్రేక్షకుల్లో జరుగుతోంది.