Senior Heroes: తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలకి మంచి గుర్తింపు ఉంటుంది. ఒకప్పుడు చిరంజీవి,నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలు సైతం ఇండస్ట్రీలో వరుస సినిమాలను చేసి మంచి విజయాలను అందుకోవడమే కాకుండా తెలుగు సినిమా స్థాయిని పెంచిన హీరోలనే చెప్పాలి. ఇక ప్రస్తుతం వీళ్లంతా సీనియర్ హీరోలుగా గుర్తింపు పొందుతున్నారు.
అయినప్పటికీ వీళ్ళు ఎక్కడ తగ్గకుండా యంగ్ హీరోలకు సైతం పోటీని ఇస్తు మంచి కథాంశాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయాలను సాధిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ నలుగురిలో చిరంజీవి ఒక్కడే ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. మిగిలిన ముగ్గురు హీరోలు మాత్రం ఓన్లీ తెలుగులో మాత్రమే సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. మరి దానికి కారణం ఏంటి అనేది క్లారిటీగా తెలియనప్పటికీ, అందుతున్న సమాచారం ప్రకారం అయితే వీళ్ళు చేసేవి రొటీన్ కమర్షియల్ సినిమాలే కాబట్టి అవి పాన్ ఇండియాలో రిలీజ్ అయిన పెద్దగా ఇంపాక్ట్ ను చూపించవు.
కాబట్టి తెలుగులోనే రిలీజ్ చేసుకొని తెలుగులో సక్సెస్ కొడితే చాలు అని వాళ్ళు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది…అలా కాకుండా ఒక మంచి సబ్జెక్టు ను తీసుకొని పాన్ ఇండియా ప్రేక్షకులకు రీచ్ అయ్యేవిధంగా సినిమాని చేస్తే సీనియర్ హీరోస్ కూడా పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపు పొంఫుతారనడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక నిజానికి ఇండియన్ సినిమా ప్రేక్షకులు ఎప్పుడైనా సరే ఒక మంచి కంటెంట్ ఉంటే భాషతో సంబంధం లేకుండా ఆ సినిమాను ఆదరిస్తారు.
అంతే కానీ సీనియర్లు, జూనియర్లు అనే తేడా ఏమీ చూపించరు. కాబట్టి ఈ సీనియర్ హీరోలు వాళ్ల బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా, వాళ్ళ ఏజ్ కి తగ్గట్టుగా ఒక మంచి కథ ను ఎంచుకొని సినిమా చేస్తే మాత్రం వాళ్ళకి కూడా పాన్ ఇండియాలో మంచి మార్కెట్ క్రియేట్ అవుతుంది. మరి ఇక మీదటైనా వీళ్ళు పాన్ ఇండియాలో సినిమాలు చేస్తారా లేదా అనేది చూడాలి…