Pushpa 2 OTT Rights
Pushpa 2 OTT Rights: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ పుష్ప 2’ పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. పార్ట్ 1 పుష్ప బ్లాక్ బస్టర్ హిట్ కాగా, ఇప్పుడు సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా పుష్ప 2 టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో అల్లు అర్జున్ లుక్ అదిరిపోయింది. కాళికా అమ్మవారి గెటప్ లో ఆయన కనిపించారు. ఈ క్రేజీ లుక్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయ్యింది.
టీజర్ లో ఒక్క డైలాగ్ కూడా లేకపోయినా పుష్ప 2 మీద హైప్ ఏర్పడింది. ఈ క్రమంలో పుష్ప 2 ఇండియా వైడ్ భారీ రికార్డు క్రియేట్ చేసింది. అధికారికంగా పుష్ప 2 మూవీ రూ. 1000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన తొలి ఇండియన్ ఫిల్మ్ గా నిలిచింది. ఇప్పటివరకు బాహుబలి , కేజీఎఫ్ 2, ఆర్ఆర్ఆర్ సినిమాలకు కూడా సాధ్యం కాని రీతిలో రూ. 1000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
పుష్ప 2 హిందీ బెల్ట్ హక్కులను రూ. 200 కోట్లకు అమ్మిన సంగతి తెలిసిందే. ఇక సౌత్ ఇండియాలో మిగితా భాషల్లో మొత్తం బిజినెస్ రూ. 270 కోట్లు వరకు ఉండనుంది. ఓవర్సీస్ హక్కులకు మరో రూ. 100 కోట్లు రానున్నాయి. కేవలం థియేట్రికల్ హక్కులు ద్వారానే పుష్ప 2 రూ. 550 కోట్లు రాబట్టనుంది. తాజా సమాచారం ప్రకారం నెట్ ఫ్లిక్ పుష్ప 2 డిజిటల్ హక్కులను ఏకంగా రూ. 275 కోట్లకు సొంతం చేసుకుంది. ఇదో రికార్డు అని చెప్పొచ్చు.
ఇక ఆడియో, శాటిలైట్ హక్కులను మరో రూ. 450 కోట్లు గా లెక్క వేశారు. దీంతో అన్ని కలిపి ప్రీ రిలీజ్ బిజినెస్ రూపంలో పుష్ప 2 సినిమా కి వెయ్యి కోట్లు రానున్నాయి.గతంలో ఈ విధంగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమా మరొకటి లేదు. ఇక విడుదల తర్వాత పుష్ప 2 ఇంకెన్ని సంచలనాలు చేయనుందో. పుష్ప 2 మూవీ ఆగస్టు 15న విడుదల కానుంది. రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.