https://oktelugu.com/

Vishal: ప్రభాస్ పెళ్లిని అలా వాడేసుకుంటున్నారు… ఇదేం ట్విస్ట్ సామీ!

ప్రభాస్ పెళ్లిని కొందరు ప్రమోషన్స్ కోసం వాడేస్తున్నారు. ఆయన పెళ్లి ప్రస్తావన తెస్తే రీచ్ బాగుంటుందని భావిస్తున్నారు. గతంలో కొందరు సెలెబ్స్ తమ సినిమాల ప్రచారం కోసం ప్రభాస్ పెళ్లి టాపిక్ తెరపైకి తెచ్చారు.

Written By:
  • S Reddy
  • , Updated On : April 20, 2024 / 08:30 AM IST

    Vishal

    Follow us on

    Vishal: ప్రభాస్ పెళ్లి ఎప్పుడు? అనేది ఎవర్ గ్రీన్ హాట్ టాపిక్. టైర్ వన్ లీగ్ లో ఉన్న ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ పెళ్లిళ్లు చేసుకుని పిల్లల్ని కూడా కనేశారు. ప్రభాస్ మాత్రం సింగిల్ గా ఉండిపోయారు. ప్రభాస్ పెళ్లి అంటూ పలుమార్లు కథనాలు తెరపైకి వచ్చాయి. అవన్నీ ఊహాగానాలుగానే మిగిలిపోయాయి. ప్రభాస్ వయసు 40 ఏళ్ళు దాటేసిన నేపథ్యంలో ఆయన అసలు పెళ్లి చేసుకుంటారా? లేదా? అనే సందేహాలు ఉన్నాయి

    అయితే ప్రభాస్ పెళ్లిని కొందరు ప్రమోషన్స్ కోసం వాడేస్తున్నారు. ఆయన పెళ్లి ప్రస్తావన తెస్తే రీచ్ బాగుంటుందని భావిస్తున్నారు. గతంలో కొందరు సెలెబ్స్ తమ సినిమాల ప్రచారం కోసం ప్రభాస్ పెళ్లి టాపిక్ తెరపైకి తెచ్చారు. తాజాగా హీరో విశాల్ సైతం అదే చేశారు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ రత్నం. ఏప్రిల్ 26న విడుదల అవుతుంది. రత్నం తెలుగు ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చిన విశాల్ లోకల్ మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో పెళ్లి ఎప్పుడని విశాల్ ని అడిగారు.

    విశాల్ తెలివిగా తన పెళ్లిని ప్రభాస్ పెళ్లితో ముడిపెట్టాడు. మీరు నడిగర్ సంఘం బిల్డింగ్ పూర్తి అయిన వెంటనే పెళ్లి చేసుకుంటాను అన్నారు. ఇంతకీ పెళ్లి ఎప్పుడని అడగ్గా.. నా పెళ్లి ప్రభాస్ పెళ్లి తర్వాతే ఉంటుంది. ముందు ఆయన పెళ్లి చేసుకోవాలి. నా మొదటి కార్డు ప్రభాస్ కి ఇస్తాను.. అన్నారు. దాంతో ప్రభాస్ పెళ్లి చర్చకు వచ్చింది. విశాల్ కామెంట్స్ వైరల్ కావడంతో రత్నం సినిమాకు బోలెడంత పబ్లిసిటీ వచ్చింది.

    అలా ప్రభాస్ పెళ్లి వార్త కొందరు హీరోల సినిమాల ప్రమోషన్స్ కి ఉపయోపడుతుంది. ఇక రత్నం సినిమా విషయానికి వస్తే అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటించింది. యాక్షన్ చిత్రాల దర్శకుడు హరి తెరకెక్కించారు. ట్రైలర్ ఆకట్టుకోగా సినిమాపై అంచనాలు పెరిగాయి. కాగా విశాల్ గత చిత్రం మార్క్ ఆంటోని వంద కోట్లకు పైగా వసూళ్లతో సత్తా చాటింది.