Roja Promotes Hari Hara Veeramallu: తమ్ముడు తమ్ముడే..పేకాట పేకాటే అని పెద్దలు చెప్పిన సామెత మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. రాజకీయాల్లో ఈ సామెత సరిగ్గా సరిపోతుంది. వైసీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే, సినీ నటి రోజా(Roja Selvamani) గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈమె ప్రత్యర్థుల పై శివంగి లాగా ఎలా విరుచుకుపడుతుందో మన కళ్లారా ఎన్నో సందర్భాలు చూసాము. ఒక్కోసారి చెవులు తూట్లు పడే రేంజ్ బూతులు కూడా మాట్లాడుతూ ఉండేది. కానీ ఈమెతో కలిసి జనసేన పార్టీ కి చెందిన నాగబాబు 8 ఏళ్లకు పైగా జబర్దస్త్ షో చేసాడు. రాజకీయంగా ఆమె అప్పుడు,ఇప్పుడు నాగబాబు ని అనేక సందర్భాల్లో విమర్శిస్తూనే వస్తుంది. కానీ ఇప్పటికీ ఆమె నాగబాబు(Nagababu Konidela) పక్కనే కూర్చొని ఒక షో చేసేంత సఖ్యత అయితే అలాగే ఉంది. అందులో ఎలాంటి సందేహం లేదు. తాజాగా ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) టీం రోజా న్యాయ నిర్ణేతగా ఉన్న షోలో ప్రొమోషన్స్ ని నిర్వహించింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే సుడిగాలి సుధీర్(Sudigaali Sudheer) వ్యాఖ్యాతగా జీ తెలుగు ఛానల్లో కొద్దిరోజుల క్రితమే డ్రామా జూనియర్స్(Drama Juniors) సీజన్ 8 మొదలైంది. 16 ఎపిసోడ్స్ ని పూర్తి చేసుకున్న ఈ షో, ఇప్పుడు 17 వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది. ఈ షోకి రోజా, డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నాడు. లేటెస్ట్ ఎపిసోడ్ కి ‘హరి హర వీరమల్లు’ హీరోయిన్ నిధి అగర్వాల్(Nidhi Agarwal) ముఖ్య అతిథిగా విచ్చేసి, తన సినిమాకు ప్రొమోషన్స్ ని చేసుకుంది. అందుకు సంబంధించిన ప్రోమో ని యూట్యూబ్ లో విడుదల చేయగా, అది బాగా వైరల్ అయ్యింది. ఈ ఈవెంట్ లో రోజా కూడా భాగమే కాబట్టి ఆమె కచ్చితంగా ‘హరి హర వీరమల్లు’ గురించి, పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) గురించి ఒక మాట మాట్లాడాల్సిందే, తప్పదు, మరి ఆమె ఏమి మాట్లాడుతుందో చూడాలి.
Also Read: 3 గంటల్లో 42 వేల టిక్కెట్లు.. తెలంగాణ లో పవన్ ఫ్యాన్స్ విశ్వరూపం!
ఒకవేళ పవన్ కళ్యాణ్ గురించి పాజిటివ్ గా మాట్లాడితే మాజీ సీఎం జగన్ తన పార్టీ నుండి సస్పెండ్ చేస్తాడేమో అని భయం కూడా ఆమెలో ఉండే ఉంటుంది. ఎందుకంటే రెండు నెలల క్రితమే వైసీపీ పార్టీ నేత దువ్వాడ శ్రీనివాస్ నారా లోకేష్ గురించి మంచిగా మాట్లాడినందుకు జగన్ అతన్ని పార్టీ నుండి సస్పెండ్ చేసాడు. రోజా కి కూడా అలాంటి గతే పడుతుందా?, లేదా కేవలం సినిమా ఈవెంట్ గా మాత్రమే చూసి, పరిగణలోకి తీసుకోకుండా వదిలేస్తారా అనేది రాబోయే రోజుల్లో చూడాలి. ఇకపోతే ‘హరి హర వీరమల్లు’ చిత్రం ఎల్లుండి ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. అనేక ప్రాంతాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ని కూడా మొదలు పెట్టారు. వరల్డ్ వైడ్ గ్రాస్ అప్పుడే 14 కోట్ల రూపాయలకు చేరిందని టాక్.