Homeఎంటర్టైన్మెంట్OTT Trouble For Rajasaab Movie?: పెద్ద సినిమాలకు ఓటీటీ కష్టాలు..'రాజాసాబ్' ని ఎవ్వరూ కొనడం...

OTT Trouble For Rajasaab Movie?: పెద్ద సినిమాలకు ఓటీటీ కష్టాలు..’రాజాసాబ్’ ని ఎవ్వరూ కొనడం లేదా..?

OTT Trouble For Rajasaab Movie?:  ప్రస్తుత ట్రెండ్ లో ఒక సినిమాకు జనాల్లో హైప్ మరియు క్రేజ్ రావాలన్నా, నిర్మాతలు ఆశించిన స్థాయిలో ఓటీటీ మరియు థియేట్రికల్ రైట్స్ బిజినెస్ జరగాలన్నా ప్రమోషనల్ కంటెంట్ క్లిక్ అవ్వడం తప్పనిసరిగా మారింది. ప్రమోషనల్ కంటెంట్ ప్రామిసింగ్ గా ఉంటే ఓటీటీ సంస్థలు ఎన్ని వందల కోట్లు నిర్మాతలకు ఇవ్వడానికైనా రెడీ. ఒకవేళ ప్రమోషనల్ కంటెంట్ ఆకట్టుకోలేకపోతే మాత్రం ఎంత పెద్ద పాన్ ఇండియన్ సూపర్ స్టార్ సినిమాకి అయినా బిజినెస్ జరగడం కష్టమైపోయింది. అందుకు ఉదాహరణ ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం. నాన్ థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయాయి కానీ, థియేట్రికల్ రైట్స్ ఇంకా అమ్ముడుపోలేదు. కారణం నిర్మాత ఆంధ్ర ప్రదేశ్,తెలంగాణ ప్రాంతాల నుండే 200 కోట్ల రూపాయిలను ఆశిస్తున్నాడు. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదలైన కంటెంట్ ఒక్కటి కూడా పేలలేదు, అందుకే నిర్మాత అడిగినంత ఇవ్వలేకపోతున్నారు.

‘హరి హర వీరమల్లు’ బాటలోనే ఇప్పుడు ప్రభాస్(Rebel Star Prabhas) ‘రాజా సాబ్'(Raja Saab) మూవీ కూడా. ఈ చిత్రం నుండి మొన్నటి వరకు ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ బయటకి రాకపోవడం తో ఓటీటీ బిజినెస్ జరగలేదు. నిన్న టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. అయినప్పటికీ కూడా ఇంకా ఓటీటీ డీల్ గురించి చర్చలు జరగడం లేదు. ప్రభాస్ సినిమా ఓటీటీ డీల్ అంటే కచ్చితంగా 150 కోట్ల రూపాయిలను నిర్మాతలు ఆశిస్తారు. కానీ ఆ రేంజ్ లో డబ్బులు ఇవ్వడానికి ఓటీటీ సంస్థలు రెడీ అవ్వాలంటే కంటెంట్ కూడా ఆ రేంజ్ లోనే ఉండాలి. ‘రాజా సాబ్’ టీజర్ ఎందుకో ప్రభాస్ రేంజ్ కి తగ్గ టీజర్ లాగా వాళ్లకు అనిపించలేదేమో. మరోపక్క మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ‘విశ్వంభర'(Viswambhara Movie) చిత్రానికి కూడా ఇదే సమస్య. ఈ ప్రాజెక్ట్ కి ఆరంభం లో మంచి క్రేజ్ ఉండేది. కానీ టీజర్ విడుదల తర్వాత ఘోరమైన ట్రోల్స్ ని ఎదురుకోవడం తో ఈ సినిమా పై మార్కెట్ లో అంచనాలు పూర్తిగా తగ్గిపోయాయి.

Also Read:  RajaSaab Teaser Review: ప్రభాస్ హర్రర్ కామెడీ.. కెవ్వు కేక అంతే..ఈ రేంజ్ ఊహించలేదు!

ఇక అప్పటి నుండి ఓటీటీ డీల్ హోల్డ్ లోనే ఉంది. నిర్మాతలు వంద కోట్ల రూపాయలకు పైగా ఈ సినిమా ఓటీటీ హక్కులను అమ్మాలని చూస్తున్నారు. కానీ ఓటీటీ సంస్థలు మాత్రం 60 కోట్లకు మించి ఒక్క పైసా కూడా ఇచ్చేందుకు సిద్ధంగా లేరట. ఈ రెండు సినిమాల పరిస్థితి ఇలా ఉంటే , గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ పరిస్థితి మరోలా ఉంది. ఏప్రిల్ నెలలో విడుదలైన ఈ సినిమా టీజర్ కి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని కళ్ళకు అద్దుకొని 130 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. నేడే పెద్ది మూవీ టీం నెట్ ఫ్లిక్స్ సంస్థతో ఒప్పందం కూడా చేసుకుందట.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Exit mobile version