Dhurandhar OTT rights: కరోనా మహమ్మారి వచ్చి వెళ్లిన తర్వాత సినీ ఇండస్ట్రీ లో జరిగిన మార్పులు చేర్పులు మనమంతా చూస్తూనే ఉన్నాం. సినిమా థియేటర్స్ లో సినిమాలను చూసే దానికంటే, ఓటీటీ లో సినిమాలను చూసేందుకే ఎక్కువ మొగ్గు చూపించారు ఆడియన్స్. ఫలితం సినీ ఇండస్ట్రీ కోట్లలో నష్టపోయింది, ఓటీటీ సంస్థలు బాగా లాభపడ్డాయి. కానీ ఇప్పుడు ఓటీటీ సంస్థలు కూడా నష్టాల్లో ఉన్నాయి. అందుకే ఒకప్పటి లాగా నిర్మాతలు అడిగినంత డబ్బులు ఇవ్వడానికి అసలు సుముఖత చూపించడం లేదు. సినిమా థియేటర్స్ లో విడుదలై సూపర్ హిట్ అయితే ఒక రేట్, లేదంటే మరో రేట్ అన్నట్టుగా సాగుతుంది ప్రస్తుత వ్యాపారం. థియేటర్స్ లో భారీ హిట్ గా నిల్చిన సినిమాలను మాత్రం సంస్థలు ఎంత రేట్ అడిగిన నిర్మాతలకు ఇచ్చేస్తున్నారు. అలాంటి సినిమాల జాబితాలోకి ఇప్పుడు ‘దురంధర్'(Dhurandhar Movie) చిత్రం కూడా చేరిపోయింది.
భారీ అంచనాలతో 280 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం, రీసెంట్ గానే భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన ఈ చిత్రం నిన్నటితో వెయ్యి కోట్ల గ్రాస్ క్లబ్ లోకి కూడా చేరింది. ఇక లాంగ్ రన్ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి. ఇకపోతే ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్(Netflix) సంస్థ కనీవినీ ఎరుగని రేంజ్ ఆఫర్ తో ఈ డీల్ ని ముగించింది. హిందీ తో పాటు తెలుగు , తమిళం , మలయాళం మరియు కనడ భాషల్లో కూడా ఈ చిత్రం ఓటీటీ లో అందుబాటులోకి రానుంది. ఇలా అన్ని భాషలకు కలిపి 285 కోట్ల రూపాయలకు డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుందని టాక్. గతం లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ చిత్రం ఓటీటీ రైట్స్ 258 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది.
నిన్న మొన్నటి వరకు ‘పుష్ప 2’ నే నెంబర్ 1 , కానీ ఇప్పుడు ఆ స్థానం లోకి దురంధర్ వచ్చింది.అయితే కొన్ని సినిమాలు థియేటర్స్ లో పెద్ద హిట్ అవుతుంటాయి కానీ , ఓటీటీ లో మాత్రం ప్లాప్స్ గా నిలిచినవి ఉన్నాయి. అలా ‘దురంధర్’ చిత్రానికి కూడా జరిగితే పరిస్థితి ఏంటి?, ఎందుకంటే ఈ సినిమాకు రోజు రోజుకు థియేటర్స్ లో ఆడియన్స్ పెరుగుతున్నారు కానీ తరగడం లేదు. అంత మంది చూసిన తర్వాత కూడా ఈ చిత్రం ఓటీటీ లో రాణిస్తుందో లేదో చూడాలి. ఇకపోతే ‘దురంధర్ 2’ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా మార్చ్ 19 న విడుదల కాబోతుంది.