https://oktelugu.com/

OTT releases this week: ఓటీటీలో ఈ వారం ఖుషితో సహా 37 సినిమాలు.. ఎందులో స్ట్రీమింగ్ అంటే!

OTT releases this week: ఓటీటీలో కొత్త చిత్రాల సందడి నెలకొంది. ఏకంగా 37 సినిమాలు వివిధ ఫ్లాట్ ఫార్మ్స్ లో స్ట్రీమ్ కానున్నాయి. వాటిలో ఖుషి వంటి క్రేజీ చిత్రం కూడా ఉంది. విజయ్ దేవరకొండ-సమంత జంటగా నటించిన ఖుషి హిట్ టాక్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ మూవీ యూఎస్ లో విశేష ఆదరణ దక్కించుకుంది. సెప్టెంబర్ 1న విడుదల కాగా నాలుగు వారాలు గడిచింది. ఖుషి […]

Written By:
  • Shiva
  • , Updated On : September 25, 2023 / 11:03 AM IST
    Follow us on

    OTT releases this week: ఓటీటీలో కొత్త చిత్రాల సందడి నెలకొంది. ఏకంగా 37 సినిమాలు వివిధ ఫ్లాట్ ఫార్మ్స్ లో స్ట్రీమ్ కానున్నాయి. వాటిలో ఖుషి వంటి క్రేజీ చిత్రం కూడా ఉంది. విజయ్ దేవరకొండ-సమంత జంటగా నటించిన ఖుషి హిట్ టాక్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ మూవీ యూఎస్ లో విశేష ఆదరణ దక్కించుకుంది. సెప్టెంబర్ 1న విడుదల కాగా నాలుగు వారాలు గడిచింది. ఖుషి చిత్ర థియేట్రికల్ రన్ ముగిసిన నేపథ్యంలో ఓటీటీలో విడుదల చేస్తున్నారు.

    ఖుషి ఓటీటీ హక్కులు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ ఫ్యాన్సీ ధర చెల్లించి దక్కించుకుంది. అక్టోబర్ 1న ఖుషి స్ట్రీమ్ కానుంది. ఖుషి ఓటీటీలో కూడా విశేష ఆదరణ దక్కించుకుంటుంది చిత్ర వర్గాల అంచనా. ఇక హాట్ స్టార్ లో కింగ్ ఆఫ్ కొత్త స్ట్రీమ్ కానుంది. దుల్కర్ సల్మాన్ హీరోగా కింగ్ ఆఫ్ కొత్త ఇటీవల విడుదలైంది. సెప్టెంబర్ 28 నుండి కింగ్ ఆఫ్ కొత్త స్ట్రీమ్ కానుంది.

    తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ ఆహా లో పాపం పసివాడు అనే మూవీ విడుదల కానుంది. పాపం పసివాడు ఆహా ఒరిజినల్ గా తెరకెక్కింది. అక్కినేని అఖిల్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఏజెంట్. అఖిల్ స్పై గా నటించాడు. ఏప్రిల్ 27న విడుదలైన ఏజెంట్ చాలా కాలం తర్వాత ఓటీటీలోకి వస్తుంది. దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించగా మమ్ముట్టి కీలక రోల్ చేశారు. ఏజెంట్ ఓటీటీ రైట్స్ సోనీ లివ్ దక్కించుకోగా సెప్టెంబర్ 29న స్ట్రీమ్ కానుంది.

    అమెజాన్ లో కుమారి శ్రీమతి అనే కామెడీ సిరీస్ సెప్టెంబర్ 28న స్ట్రీమ్ కానుంది. ఇందులో నిత్యా మీనన్ ప్రధాన పాత్ర చేశారు. అలాగే ఇంగ్లీష్, హిందీ, తమిళ, మలయాళ చిత్రాలు, సిరీస్లు స్ట్రీమ్ కానున్నాయి.

    హాట్ స్టార్

    ఎల్-పాప్ (సెప్టెంబర్ 27)
    ద వరస్ట్ ఆఫ్ ఈవిల్ ( సెప్టెంబర్ 27)
    కింగ్ ఆఫ్ కొత్త (సెప్టెంబరు 28)
    లాంచ్ ప్యాడ్ సీజన్ 2 (సెప్టెంబర్ 29)
    తుమ్ సే నా హో పాయేగా (సెప్టెంబర్ 29)

    నెట్ఫ్లిక్స్

    లిటిల్ బేబీ బమ్: మ్యూజిక్ టైమ్ (సెప్టెంబర్ 25
    ద డెవిల్స్ ప్లాన్(సెప్టెంబర్ 26 )
    ఫర్‌గాటెన్ లవ్( సెప్టెంబర్ 27)
    ఓవర్‌హౌల్ (సెప్టెంబర్ 27)
    స్వీట్ ఫ్లో 2 (సెప్టెంబర్ 27)
    ద వండర్‌ఫుల్ స్టోరీ ఆఫ్ హెన్రీ షుగర్ (సెప్టెంబరు 27)
    క‍్యాజల్వేనియా: నోక్ట్రన్ (సెప్టెంబర్ 27)
    ఐస్ కోల్డ్: మర్డర్, కాఫీ అండ్ జెస్సీకా వాంగ్సో (సెప్టెంబర్ 28)
    లవ్ ఈజ్ ఇన్ ద ఎయిర్ (సెప్టెంబర్ 28)
    ఫెయిర్ ప్లే (సెప్టెంబర్ 29)
    చూనా (సెప్టెంబర్ 29)
    నో వేర్ (సెప్టెంబర్ 29)
    రెప్టైల్ (సెప్టెంబర్ 29)
    ఖుషి (అక్టోబరు 01)
    స్పైడర్‌మ్యాన్: ఎక్రాస్ ద స్పైడర్-వర్స్ ( అక్టోబరు 01)

    అమెజాన్ ప్రైమ్

    ద ఫేక్ షేక్ (సెప్టెంబర్ 26)
    హాస్టల్ డేజ్ సీజన్ 4 (సెప్టెంబర్ 27)
    డోబుల్ డిస్కోర్షో (సెప్టెంబరు 28)
    కుమారి శ్రీమతి (సెప్టెంబర్ 28)
    జెన్ వీ (సెప్టెంబర్ 29)

    బుక్ మై షో

    బ్లూ బీటల్ (ఇంగ్లీష్ సినిమా) – సెప్టెంబర్ 29
    సైనా ప్లే
    ఎన్నీవర్ (సెప్టెంబర్)
    లయన్స్ గేట్ ప్లే
    సింపతీ ఫర్ ద డెవిల్ (సెప్టెంబర్ 29)

    జియో సినిమా

    ద కమెడియన్ (సెప్టెంబర్ 29)
    బిర్హా: ద జర్నీ బ్యాక్ హోమ్ ( సెప్టెంబర్ 30)
    బేబాక్ (అక్టోబర్ 01)

    సోనీ లివ్

    చార్లీ చోప్రా (సెప్టెంబర్ 27)
    అడియై! (సెప్టెంబర్ 29)
    ఏజెంట్ (సెప్టెంబర్ 29)

    ఆహా

    పాపం పసివాడు (సెప్టెంబర్ 29)
    డర్టీ హరి (సెప్టెంబర్ 29)