This Week OTT Release: సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. కారణం ఏంటి అంటే వాళ్ల సినిమాలు మాత్రమే ప్రేక్షకులను ఎక్కువ అలరిస్తూ ఉంటాయి. తద్వారా వాళ్ళు చేసిన సినిమాలకి ఇండస్ట్రీలో గొప్ప క్రేజ్ దక్కుతోంది. ఇక ఇలాంటి క్రమంలోనే ఇండస్ట్రీ లో ఉన్న కొంతమంది యంగ్ స్టర్స్ సైతం ప్రస్తుతం వాళ్లు చేస్తున్న సినిమాలతో గొప్ప విజయాలను అందుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. అందులో కొంతమందికి సక్సెసులు దక్కితే మరి కొంతమంది ఫెయిల్యూర్ చవి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇక ఇది ఇలా ఉంటే డీజే టిల్లు సినిమాతో గొప్ప విజయాన్ని అందుకొని యూత్ లో గొప్ప క్రేజ్ ను సంపాదించుకున్న నటుడు సిద్దు జొన్నలగడ్డ…రీసెంట్ గా ఆయన చేసిన ‘తెలుసు కదా’ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. దాంతో ఆయన కొంతవరకు డీలా పడిపోయాడు. ఇక ఈ సినిమా ఈనెల 14వ తేదీన నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవబోతోంది…
ఇక తమిళ్ స్టార్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకుంటున్న ప్రదీప్ రంగనాథన్ సైతం ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకులను పలకరించాడు. ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాల్లో ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఒక్కో మెట్టు పైకెక్కుతూ మంచి సినిమాలను చేస్తూ గొప్ప విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతున్నాడు.
ఇక ఈ సినిమా సైతం ఈనెల 14వ తేదీన నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుండటం విశేషం… ఇక తమిళ్ సినిమా ఇండస్ట్రీ తో పాటు తెలుగులో కూడా గొప్ప గుర్తింపును సంపాదించుకున్న నటుడు విక్రమ్…అతని కొడుకు అయిన దృవ్ విక్రమ్ హీరోగా వచ్చిన ‘బైసన్’ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయింది. ఈ సినిమాకి థియేటర్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరు విక్రమ్ చేసిన యాక్టింగ్ కి ఫిదా అయిపోయారు.
ఈ సినిమా సైతం ఈనెల 14వ తేదీన నెట్ ఫిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుండడం విశేషం… మారి సెల్వరాజు సైతం ఈ సినిమా కోసం విపరీతంగా కష్టపడి ఒక బెస్ట్ అవుట్ పుట్ అయితే ఇచ్చాడు. మరి థియేటర్లో సక్సెస్ ని సాధించిన ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో ఎలాంటి విజయాన్ని సాధిస్తోంది. తద్వారా ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనేది తెలియాల్సి ఉంది… రష్మిక మందన, ఆయుష్మాన్ ఖురాన్ మెయిన్ లీడ్ లో నటించిన ‘థామా’ సినిమా సైతం ఈనెల 16 వ తేదీన ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అవ్వబోతోంది…