Horoscope Today:శుక్రాధిత్య యోగం కారణంగా ఈ రాశుల వారికి అన్నీ శుభాలే..

Horoscope Today: 2024 జూన్ 19 బుధవారం రోజున ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో త్రిగ్రాహి యోగం, శుక్రాధిత్య యోగం కలగనున్నాయి.

Written By: Srinivas, Updated On : June 19, 2024 7:36 am

horoscope today

Follow us on

Horoscope Today: 2024 జూన్ 19 బుధవారం రోజున ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో త్రిగ్రాహి యోగం, శుక్రాధిత్య యోగం కలగనున్నాయి. దీంతో కొన్ని రాశుల వారికి ఆదాయం పంట పండుతుంది. మేషం నుంచి 12 రాశుల వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి:
పెండింగులో ఉన్న బకాయిలు వసూలవుతాయి. ఉద్యోగులు కొన్ని విషయాల్లో విజయం సాధిస్తారు. వ్యాపారులు కష్టాలను ఎదుర్కొంటారు. విద్యార్థులు కెరీర్ గురించి ఆలోచిస్తారు.

వృషభ రాశి:
కుటుంబంతో సంతోషంగా ఉంటారు. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. రాజకీయాలతో సంబంధం ఉన్న వారు జాగ్రత్తగా ఉండలి.

మిథున రాశి:
ఎవరికైనా డబ్బు ఇస్తే వారి ఈరోజు మీకు తిరిగి ఇస్తారు. వ్యాపారులకు అనుకోని లాభాలు ఉంటాయి. విద్యార్థులకు మేలు జరుగుతుంది. తల్లిదండ్రులతో విభేదాలు ఉంటాయి.

కర్కాటక రాశి:
ఉద్యోగులకు అధిక ప్రయోజనాలు ఉంటాయి. వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి. కెరీర్ కు సంబంధించి విద్యార్థులు కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

సింహారాశి:
జీవిత భాగస్వామి కోసం బహుమతిని కొనుగోలు చేస్తారు. అన్ని రకాలుగా ఆనందంగా ఉంటారు. ఆదాయం పెరిగినా ఖర్చులు పెరుగుతాయి. అయితే నిరాశ చెందొద్దు.

కన్య రాశి:
కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. జీవిత భాగస్వామితో కొన్ని విభేదాలు రావొచ్చు. శుభకార్యాల్లో పాల్గొంటారు.

తుల రాశి:
అనుకోని ఆదాయం వస్తుంది. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఆహారపు అలవాట్ల విషయంలో జాగ్రత్తలు పాటించాలి.

వృశ్చిక రాశి:
వ్యాపారులు ముఖ్యమైన ఒప్పందాలు చేసుకుంటారు. ఉద్యోగులు సీనియర్ల మద్దతు పొందుతారు. వ్యాపారులకు తల్లిదండ్రులమద్దతు ఉంటుంది.

ధనస్సు రాశి:
మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. స్నేహితుల ద్వారా ధనం వచ్చే అవకాశం ఎక్కువ. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేస్తారు. ఆర్థికంగా పుంజుకుంటారు.

మకర రాశి:
వ్యాపారులకు మంచి లాభాలు ఉంటాయి. సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు. ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. నాణ్యమైన ఆహారం తీసుకోవాలి.

కుంభరాశి:
ఇతరులతో వాదనలకు దిగొద్దు. మీకే అన్యాయం జరుగుతుంది. డబ్బును స్వీకరించేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. శుభకార్యాల్లో పాల్గొంటారు.

మీనరాశి:
ఆరోగ్యంగా ఉంటారు. అనుకోని లాభాలు వస్తాయి. వ్యాపారంలో విజయం మీదే. భవిష్యత్ కోసం ప్రణాళిక వేస్తారు. సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు.