OTT Platforms Control Producers : కార్పొరేట్ సంస్థల స్ట్రాటజీ పరిశీలిస్తే.. మొదట్లో మంచి ఆఫర్స్ ఇచ్చి సాంప్రదాయ వ్యాపారులను దెబ్బతీస్తాయి. ఆ వ్యవస్థలను పూర్తిగా చంపేసి వినియోగదారుడికి ప్రత్యామ్నాయం లేకుండా చేస్తారు. అప్పుడు అధిక ధరలతో వినియోగదారులను లూటీ చేస్తారు. సాంప్రదాయ కేబుల్ టీవీ వ్యవస్థను దాదాపు లేకుండా చేసిన డీటీహెచ్ లు ప్రస్తుతం చేస్తున్నది అదే. సాధారణ తెలుగు ప్యాక్ చూడాలంటేనే నెలకు 300-400 చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. హెడ్డీ ప్యాక్ కి మరొక రేటు. స్పోర్ట్స్, కిడ్స్, నాలెడ్జ్ ఛానల్స్ చూడాలంటే యాడ్ ఆన్ చార్జెస్ చెల్లించాలి. ఇలా ఛార్జీల రూపంలో వినియోగదారులను దోచేస్తున్నారు.
Also Read : త్రివిక్రమ్ – అల్లు అర్జున్ మూవీ కాన్సిల్ అవ్వడానికి కారణం అల్లు అరవింద్ గారేనా..?
ఓటీటీ సంస్థలు చేస్తున్నది కూడా ఇదే. ఇండియన్ ఎంటర్టైన్మెంట్ అండ్ మీడియా ఇండస్ట్రీ టర్న్ ఓవర్ ఓవర్ 2.5 లక్షలు అని అంచనా(2024). ఈ ఇండస్ట్రీలో గ్రోత్ స్టడీగా ఉంది. మరి ఇంత పెద్ద మార్కెట్ కలిగిన ఇండియాను కార్పొరేట్ సంస్థలు ఎందుకు వదిలిపెడతాయి. ఎక్కువ సబ్స్క్రైబర్స్ ని పొందడం ద్వారా మేజర్ మార్కెట్ షేర్ రాబట్టాలని స్వదేశీ, విదేశీ ఓటీటీ సంస్థలు పోటీపడుతున్నాయి. ఆహా, ఈటీవీ విన్ వంటి ప్రాంతీయ భాషలకు చెందిన ఓటీటీ సంస్థలు కూడా పుట్టుకొచ్చాయి.
భవిష్యత్ ఓటీటీదే.. థియేటర్ కి వెళ్లి సినిమా చూసే సాంప్రదాయం రానున్న కాలంలో కనుమరుగు అవుతుంది అనేది, ఈ సంస్థల అంచనా. అది నిజం కూడాను. ఇప్పటికే ఇది మొదలైంది. గ్రామాలకు కూడా ఓటీటీ కల్చర్ వ్యాపించగా తెలుగు రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో థియేటర్స్ మూతపడుతున్నాయి. మూవీ విడుదలైన నాలుగు వారాల్లో ఓటీటీలోకి వస్తున్న తరుణంలో ప్రేక్షకులు థియేటర్ కి వెళ్లాలన్న ఆసక్తి వదిలేస్తున్నారు. నిర్మాత బన్నీ వాసు ఇటీవల ఇదే అంశం మీద ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద హీరోలు మూడేళ్లకు ఒక సినిమా చేయడం వలన, ఓటీటీలో అతి తక్కువ సమయంలో సినిమాలు అందుబాటులోకి రావడం వలన 90 శాతానికి పైగా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ మూతపడనున్నాయి. అదే జరిగితే మల్టీఫ్లెక్స్ నుండి నిర్మాతలకు వచ్చే ఆదాయం 43% శాతమే అన్నారు. అంటే మిగతా ఆదాయం ఓటీటీ సంస్థలకు చేరుతుందని చెప్పకనే చెప్పినట్లు.
మరొక ఆందోళనకర అంశం… సినిమాల విడుదల తేదీలను ఓటీటీ సంస్థలు ప్రభావితం చేస్తున్నాయి. ఓటీటీ డీల్స్ జరిగేటప్పుడే విడుదల తేదీలను కూడా డిసైడ్ చేస్తున్నారట. ఓటీటీ సంస్థలు చెప్పిన తేదీకి సినిమా విడుదల చేయకపోతే, ఒప్పుకున్న ధరలో కటింగ్స్ తప్పవు అట. థియేటర్స్ లో ఓ పెద్ద సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోతే ఒప్పందం చేసుకున్న మొత్తం ఇవ్వడం లేదు. కొన్ని సినిమాల విషయంలో ఏకంగా డీల్ క్యాన్సిల్ చేస్తున్నారు. కోట్లు పెట్టి సినిమా చేసిన నిర్మాతకు కనీసం విడుదల తేదీని డిసైడ్ చేసే అధికారం ఉండటం లేదనే వాదన ఇండస్ట్రీలో ఉంది. ఏది ఏమైనా పరిశ్రమ ఇప్పటికైనా మేల్కొని ఓటీటీ సంస్థలకు కళ్లెం వేయాలి. సాంప్రదాయ థియేటర్ కల్చర్ ని కాపాడుకోవాలి. పూర్తిగా థియేటర్స్ మూతపడి ఓటీటీలోనే సినిమాలు చూడాల్సి వస్తే.. అటు ప్రేక్షకులు, ఇటు నిర్మాతలు నష్టపోవడం ఖాయం అంటున్నారు.