
Oscar 2023 – RRR : ఊహించిందే జరిగింది. జక్కన్న రాజమౌళి ప్రతిభ ప్రపంచం చవిచూసింది. ఏకంగా తెలుగు పాటకు ఆస్కార్ అవార్డు వరించింది..ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో “నాటు నాటు” పాటకు అకాడమీ ఆవార్డు ఫిదా అయింది. పోటీలో ఎన్ని పాటలు ఉన్నా నాటు కు జై కొట్టింది. దిస్ అవార్డు గోస్ టూ ఆస్కార్ అవార్డు అందజేసి మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. యావత్ భారతదేశాన్ని సంబరాల్లో ముంచింది. అప్పుడెప్పుడో స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాలో జయహో పాటకు ఆస్కార్ అవార్డు వచ్చింది. తర్వాత ఇప్పుడు నాటు నాటు పాట ఆస్కార్ దక్కించుకుంది.
నాటు నాటు పాట ఈ రేంజ్ లో ఖండాలను దాటి రీచ్ అయ్యి ఆస్కార్ అవార్డుని గెలుచుకోవడానికి ప్రధాన కారణం కొరియోగ్రాఫేర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ అని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు ఆస్కార్ తెరపై ఆయనే పేరు, ప్రస్తావన రాకపోవడం అందరినీ ఆవేదనకు గురిచేస్తోంది. ఇంత అద్భుతమైన స్టెప్స్ ని కంపోజ్ చేసి ఉండకపోతే ఈరోజు ఈ పాటకి ఈ రేంజ్ రెస్పాన్స్ వచ్చి ఉండేది కాదు.ఆ తర్వాతి క్రెడిట్ మాత్రం రామ్ చరణ్ – ఎన్టీఆర్ లదే.వాళ్ళ వల్లే ఈ పాటకి ఈ రేంజ్ రీచ్ వచ్చింది. కానీ వారి పేర్లు ఇప్పుడు ఆస్కార్ పై కీరవాణి , చంద్రబోస్ ప్రస్తావించకపోవడం గమనార్హం.
నాటు నాటు పాటను ఉక్రెయిన్ దేశంలో చిత్రీకరించారు. ఈ పాట చిత్రీకరించే ముందు అక్కడ ఇంకా యుద్ధం ప్రారంభం కాలేదు. ఇక ఆ పాటలో చరణ్, తారక్ వెనుక కనిపించే కోట ఆ దేశ అధ్యక్షుడి అధికారిక నివాసం. ఆర్ ఆర్ ఆర్ చిత్ర బృందం అడగగానే పాట కోసం ఎటువంటి షరతులు పెట్టకుండా ఇచ్చేశారు. ఈ పాటలో హుక్ స్టెప్ కోసం ప్రేమ్ రక్షిత్ కంపోజ్ చేసిన మూమెంట్స్ ఆడియన్స్ కు బాగా నచ్చాయి.. ఆడియన్స్ ఎంజాయ్ చేయాలంటే డ్యాన్స్ మాస్టర్ చేసిన స్టెప్స్ ను యాజ్ ఇట్ ఈజ్ గా హీరోలు చేయాల్సి ఉంటుంది. కానీ ప్రేమ్ రక్షిత్ కంపోజ్ చేసిన దానికంటే తారక్, ఎన్టీఆర్ ఎక్కువ చేశారు కాబట్టే ఆ పాట అంత సూపర్ హిట్ అయింది.
సాధారణంగా చరణ్, తారక్ సింగిల్ టేక్ లోనే సీన్ చేసేస్తారు. ఇక డ్యాన్స్ అయితే ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. అలాంటి వారికి నాటు నాటు పాట పరీక్ష పెట్టింది. ఈ పాటలో 80 కి పైగా వేరియేషన్ స్టెప్ లను ప్రేమ్ రక్షిత్ కంపోజ్ చేశారు.. తారక్, చరణ్ 18 కి పైగా టేకులు తిన్నారు. ఇన్ని టేకులు తీసుకున్నప్పటికీ… రెండో టేకును రాజమౌళి ఓకే చేశారు.. ఇక చంద్రబోస్ రాసిన ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్ పాడారు.. తన గాత్రంతో ఈ పాటను మరో స్థాయికి తీసుకెళ్లారు.
మరోవైపు ఈ పాట ఆస్కార్ గెలుచుకోవడంతో దీనివెనుక అసలైన కష్టం, ఖ్యాతి కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ కు దక్కాలి. కానీ ఆస్కార్ వేదికపై ప్రేమ్ ప్రస్తావన ఇసుమంతైనా వినిపించకపోవడం లేకపోవడం డ్యాన్స్ అభిమానులను ఆవేదనకు గురిచేస్తోంది.