Oscar Awards 2024
Oscar Awards 2024: లాస్ ఏంజెల్స్ వేదికగా డాల్బీ థియేటర్ లో 96వ ఆస్కార్స్ వేడుక ముగిసింది. విజేతలు వేదికపై మెరిశారు. ఈసారి క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ఓపెన్ హైమర్ సత్తా చాటింది. పలు విభాగాల్లో అవార్డులు కైవసం చేసుకుంది. అలాగే ఓపెన్ హైమర్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తన ఫస్ట్ ఆస్కార్ అందుకున్నాడు. ప్రతిష్టాత్మక ఉత్తమ నటుడు అవార్డు ఓపెన్ హైమర్ చిత్రంలో నటనకు సిలియన్ మర్ఫీకి దక్కింది. ఉత్తమ నటి అవార్డు పూర్ థింగ్స్ చిత్రంలో నటనకు గాను ఎమ్మా స్టోన్ పొందారు.
ఇక 13 విభాగాల్లో నామినేట్ అయిన ఓపెన్ హైమర్ 7 ఆస్కార్ అవార్డులు సొంతం చేసుకుంది. ఈ ఏడాదికి అత్యధిక అవార్డులు అందుకున్న చిత్రంగా రికార్డులకు ఎక్కింది. కాగా గత ఏడాది ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ అందుకుంది. ఈసారి ఈ కేటగిరీలో బార్బీ చిత్రం నుండి ”వాట్ వజ్ ఐ మేడ్ ఫర్’ ఆస్కార్ గెలుపొందింది. ఇక విభాగాల వారీగా ఆస్కార్ అందుకున్న విజేతలు ఎవరో చూద్దాం…
ఉత్తమ చిత్రం: ఓపెన్‌హైమర్
ఉత్తమ నటుడు: సిలియన్ మర్ఫీ (ఓపెన్‌హైమర్)
ఉత్తమ నటి: ఎమ్మా స్టోన్ (పూర్ థింగ్స్)
ఉత్తమ దర్శకుడు: క్రిస్టోఫర్ నోలన్ (ఓపెన్‌హైమర్)
ఉత్తమ సహాయ నటి: డా’వైన్ జాయ్ రాండోల్ఫ్( ద హోల్డోవర్స్)
ఉత్తమ సహాయ నటుడు: రాబర్ట్ డౌనీ జూనియర్ ( ఓపెన్‌హైమర్)
ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే: అనాటమీ ఆఫ్ ఎ ఫాల్
ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే: అమెరికన్ ఫిక్షన్
బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్: ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్
ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్: ది బాయ్ అండ్ ది హెరాన్
ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్: వార్ ఈజ్ ఓవర్!
ఉత్తమ ఒరిజినల్ స్కోర్: లుడ్విగ్ గోరాన్సన్ ( ఒపెన్‌హైమర్)
ఉత్తమ ఒరిజినల్ సాంగ్: వాట్ ఐ యామ్ మేడ్ ఫర్ (బార్బీ)
బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్: ది వండర్ ఫుల్ స్టోరీ ఆఫ్ హెన్రీ షుగర్
ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్: 20 డేస్ ఇన్ మారియుపోల్
ఉత్తమ డాక్యుమెంటరీ (షార్ట్ సబ్జెక్ట్): ది లాస్ట్ రిపేర్ షాప్
ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్: ఓపెన్‌హైమర్
ఉత్తమ సినిమాటోగ్రఫీ: ఓపెన్‌హైమర్
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్: పూర్ థింగ్స్
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: పూర్ థింగ్స్
ఉత్తమ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్: పూర్ థింగ్స్
ఉత్తమ సౌండ్: జానీ బర్న్ అండ్ టార్న్ విల్లర్స్ ( ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్)
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: గాడ్జిల్లా మైనస్ వన్
Web Title: Oscar awards 2024 winners list
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com