
Elephant Whisperers wins Oscar 2023 : ప్రపంచంలో ఉన్న సినీ అభిమానులు మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఆస్కార్ అవార్డ్స్ ప్రధానోత్సవం నేడు లాస్ ఏంజిల్స్ లో ఘనంగా జరిగింది.ఎన్నడూ లేని విధంగా ఆస్కార్ అవార్డ్స్ లో మన ఇండియన్ సినిమాలు సత్తా చాటడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.ఇది వరకు ఇంగ్లీష్ మూవీస్ కి మాత్రమే అత్యధికంగా అవార్డ్స్ వచ్చేవి,కానీ ఇప్పుడు ఇండియన్ సినిమాలు కూడా హోరెత్తించేస్తున్నాయి.
రీసెంట్ గా మన #RRR చిత్రం ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్స్ లో ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ క్యాటగిరిలో నామినేషన్ ని దక్కించుకుంది.#RRR తో పాటుగా ‘బెస్ట్ షార్ట్ ఫిలిం’ క్యాటగిరిలో ‘ఎలిఫెంట్ విష్ప్ర్స్’ అనే చిత్రం నామినేట్ అయ్యింది.నెట్ ఫ్లిక్స్ సంస్థ తెరకెక్కించిన ఈ లఘు చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.చక్కటి ఫీల్ గుడ్ డాక్యుమెంటరీ లఘు చిత్రం గా పేరు తెచ్చుకున్న ఈ చిత్రం ఆస్కార్ నామినేషన్స్ లో అడుగుపెట్టగానే అందరూ ప్రశంసల ఎంతో సంతోషించారు.
అందరూ ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు రావాలని కోరుకున్నారు,అనుకున్న విధంగానే ఆ కోరిక నెరవేరడంతో మన ఇండియన్ సినీ ఇండస్ట్రీ ప్రేక్షకుల ఆనందానికి హద్దులే లేకుండా పోయింది.కాసేపటి క్రితమే ఈ అవార్డు ని ప్రకటించారు.కార్తీక్ గొంసాల్వేస్ దర్శకత్వం వహించిన ఈ తమిళ సినిమా నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.ఆస్కార్ అవార్డు దక్కిన తర్వాత ఈ లఘు చిత్రం ఇప్పుడు ట్రేండింగ్ లోకి వచ్చేసింది.
ఈ లఘు చిత్రం నిడివి కేవలం 45 నిమిషాలు మాత్రమే.ఏనుగు తో ఒక కుటుంబానికి ఉన్న అనుబంధం ఎలాంటిదో చాలా చక్కగా 45 నిమిషాలలోనే డైరెక్టర్ చూపించడం నిజంగా చాలా గ్రేట్ అనే చెప్పాలి.అందుకే ఇలాంటి సినిమాకి ఆస్కార్ అవార్డు రావడం లో ఎలాంటి అతిశయం లేదు అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.