NTR On Oscar Academy: యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన నటించే సినిమాలు సూపర్ హిట్ ను అందుకుంటాయి. ఫ్లాప్ లు తక్కువ, హిట్ లు ఎక్కువ. ఇదిలా ఉంటే ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తున్న ఎన్టీఆర్, రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. అయితే మన టాలీవుడ్ నుంచి వచ్చిన ఒక బిగ్గెస్ట్ గ్లోబల్ సెన్సేషన్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” చిత్రంతో అయితే ఈ సినిమా స్టార్స్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి అలాగే హీరోలు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లకి గ్లోబల్ వైడ్ గా ఎలాంటి రీచ్ వచ్చిందో అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం అయితే తన నాటు నాటు సాంగ్ కి గాను రెండు ఆస్కార్ అవార్డ్స్ కూడా గెలిచి చరిత్ర సృష్టించింది.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా మరో చరిత్ర సృష్టించింది. ఆస్కార్ కమిటీ ఎన్టీఆర్‌కు ఓ అరుదైన గౌరవాన్ని ఇచ్చింది. అకాడమీ కొత్త మెంబర్స్ లిస్ట్‌లో ఎన్టీఆర్‌ను చేర్చింది. యాక్టర్స్ బ్రాంచ్‌లో అకాడమీ ఎన్టీఆర్ పేరును అధికారికంగా అనౌన్స్ చేసింది. ఇక ఇది తెలుసుకున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. కాలర్ ఎగరేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరు కూడా తమ టాలెంట్ ను చూపించారు. ఈ ఇద్దరి వల్లే సినిమా హిట్ అయింది అనడంలో సందేహం లేదు. ఇద్దరు కూడా పాన్ వరల్డ్ రేంజ్ లో క్రేజ్ సంపాదించారు. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో జీవించేశారు. ఇక ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తే.. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సినిమాను నిర్మిస్తోంది. ఇందులో ఎన్టీఆర్ సరసన జాన్వీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
View this post on Instagram