Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7 చివరి దశకు చేరుకుంది. హౌస్లో టాప్ 6 ఉన్నారు. 14వ వారం శోభ శెట్టి ఇంటిని వీడింది. శివాజీ, ప్రశాంత్, అమర్ దీప్, ప్రియాంక, అర్జున్, యావర్ లను బిగ్ బాస్ తెలుగు 7 ఫైనలిస్ట్స్ గా ప్రకటించారు. ఇకపై ఎలిమినేషన్ ఉండదని సమాచారం. ఈ సీజన్ కి ఆరుగురు ఫైనల్ లో ఉంటారు. ఇక వారం రోజుల క్రితమే ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. ప్రేక్షకులు టైటిల్ విన్నర్ ని ఎన్నుకునేందుకు ఓట్లు వేయాల్సి ఉంది.
ఈ క్రమంలో విన్నర్ ఎవరంటూ అనేక అనధికారిక సర్వేలు జరుగుతున్నాయి. ప్రముఖ మీడియా సంస్థలు పోల్స్ నిర్వహిస్తున్నారు. బాలీవుడ్ మీడియా ఆర్మాక్స్ సర్వే ఫలితాలు విడుదల చేసింది. డిసెంబర్ 2 నుండి 8 వరకు జరిపిన సర్వే ఫలితాలు వెల్లడించింది. ఈ సర్వే ప్రకారం శివాజీ అగ్రస్థానంలో ఉన్నారు. శివాజీ మొదటి నుండి టాప్ లో ఉంటున్నారు. ఇటీవల కొంచెం డౌన్ అయ్యాడు. పల్లవి ప్రశాంత్ అతన్ని అధిగమించాడు.
ఆర్మాక్స్ సర్వేలో మాత్రం శివాజీ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. ఇక రెండో స్థానంలో పల్లవి ప్రశాంత్ ఉన్నాడు. రైతుబిడ్డగా హౌస్లో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ తన ఆట తీరుతో అభిమానులను విపరీతంగా పెంచుకున్నాడు. టైటిల్ ఫేవరేట్ గా కూడా ఉన్నాడు. ఇక మూడో స్థానంలో అమర్ దీప్ ఉన్నాడు. టైటిల్ రేసులో అమర్ దీప్ కూడా ఉన్నాడని పలు సర్వేలు తెలియజేస్తున్నాయి. అమర్ దీప్ కి పలువురు సెలెబ్రిటీలు స్ సపోర్ట్ చేస్తున్నారు.
అది అమర్ దీప్ కి ప్లస్ అవుతుంది. ఇక నాలుగో స్థానంలో ప్రియాంక ఉంది. ఐదో స్థానంలో అర్జున్ ఉన్నాడు. అర్జున్ ఆట తీరు బాగుంది. కానీ అతడు వైల్డ్ కార్డు ఎంట్రీ. ఆలస్యంగా హౌస్లోకి అడుగు పెట్టడం మైనస్ అయ్యింది. కాబట్టి ఆర్మాక్స్ సర్వే ప్రకారం పల్లవి శివాజీ టైటిల్ విన్నర్. అయితే పల్లవి ప్రశాంత్ పేరు గట్టిగా వినిపిస్తోంది. అతడు టైటిల్ విన్నర్ కావొచ్చు…