Homeఎంటర్టైన్మెంట్Ooru Peru Bhairavakona Trailer: ఊరు పేరు భైరవకోన ట్రైలర్: సందీప్ కిషన్ నుండి సరికొత్త...

Ooru Peru Bhairavakona Trailer: ఊరు పేరు భైరవకోన ట్రైలర్: సందీప్ కిషన్ నుండి సరికొత్త మూవీ, విజువల్స్ అదుర్స్!

Ooru Peru Bhairavakona Trailer: సస్పెన్సు థ్రిల్లర్స్, హారర్ మూవీస్ అద్భుత విజయాలు సాధిస్తున్నాయి. ఈ జోనర్స్ పై ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల విడుదలైన సస్పెన్సు థ్రిల్లర్ మంగళవారం మంచి విజయం సాధించింది. అయితే రాంగ్ టైం లో విడుదల చేయడం వలన కలెక్షన్స్ కోల్పోయింది. ఇదే కోవలో తెరకెక్కింది ‘ఊరు పేరు భైరవకోన’. సందీప్ కిషన్ హీరోగా నటించాడు. ఊరు పేరు భైరవకోన విడుదలకు సిద్ధం అవుతుండగా ప్రమోషన్స్ షురూ చేశారు. ఇందులో భాగంగా నేడు ట్రైలర్ విడుదలైంది.

దాదాపు రెండు నిమిషాల నిడివిగల ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ‘గరుడ పురాణంలో మాయమైన ఆ నాలుగు పేజీలే ఈ భైరవకోన’ అనే వాయిస్ ఓవర్ భీకరంగా ఉంది. ట్రైలర్ లో విజువల్స్ గూస్ బంప్స్ రేపుతున్నాయి. మిస్టరీ, హారర్, సస్పెన్సు అంశాలతో ట్రైలర్ సాగింది. కథపై దర్శకుడు ఎలాంటి హింట్ ఇవ్వలేదు. హీరో సందీప్ కిషన్ రోల్, క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉన్నాయి. గతంలో ఇలాంటి పాత్రలో ఆయనను చూడలేదు.

భైరవకోన అనే ప్రాంతం చుట్టూ అల్లుకున్న కథ అని తెలుస్తుంది. అక్కడ జరిగే విపరీతాలకు కారణం ఏమిటీ? దీని వెనుక ఉంది ఎవరు? అనేదే అసలు ట్విస్ట్. కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ హీరోయిన్స్ గా కీలక రోల్స్ చేస్తున్నారు. కథలో భాగమైన వారి పాత్రల తాలూకు లుక్స్ మెప్పించాయి. భైరవకోన చిత్రానికి విఐ ఆనంద్ దర్శకుడు. గతంలో ఈయన తెరకెక్కించిన ఎక్కడిపోతావు చిన్నవాడా సూపర్ హిట్.

రవితేజతో చేసిన డిస్కో రాజా మాత్రం నిరాశపరిచింది. దాంతో సందీప్ కిషన్ హీరోగా ఊరు పేరు భైరవకోన చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. సందీప్ కిషన్ తో పాటు విఐ ఆనంద్ కి ఈ చిత్ర విజయం చాలా అవసరం. ఇద్దరూ పరాజయాల్లో ఉన్నారు. హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో రాజేష్ దండ నిర్మిస్తున్నారు. ఊరు పేరు భైరవకోన చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. ఫిబ్రవరి 9న విడుదల కానుంది.

 

Ooru Peru Bhairavakona Trailer |Sundeep Kishan | VI Anand | Shekar Chandra| #BhairavaKonaFeb9th

Exit mobile version