Sukumar: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు ఉన్నప్పటికీ వాళ్లు వాళ్ళ సినిమాలని చేసుకుంటూ ముందుకు కదులుతూ ఉంటారు. ఇక వాళ్ల సినిమాలు చేసుకోవడానికే వాళ్లకి టైం సరిపోవట్లేదంటే మిగతా వాళ్ల గురించి ఆలోచించే అవకాశం కూడా వాళ్ళకి ఉండదు. ఇక ఇలాంటి క్రమంలో సుకుమార్ మాత్రం చాలా కొత్త విధానాన్ని అనుసరిస్తూ ముందుకు సాగుతున్నాడు. తను మాత్రమే ఎదగకుండా తన దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరిని ఇండస్ట్రీ కి పరిచయం చేస్తూ తన శిష్యుల పట్ల తనకు ఎంత ప్రేమ ఉందో ప్రూవ్ చేసుకుంటున్నాడు. ఇక సుకుమార్ కి అత్యంత ప్రియ శిష్యుడు అయిన బుచ్చిబాబు సన ని ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.
ఈ సినిమా సూపర్ సక్సెస్ అయింది ఇక ఇప్పుడు బుచ్చిబాబు రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నాడు. ఇక ఆయన తర్వాత విరూపాక్ష సినిమాతో కార్తీక్ దండు ని కూడా ఒక మంచి హిట్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు సెల్ఫిష్ అనే మూవీ తో మరొక డైరెక్టర్ ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడు. అలాగే దసరా సినిమా తీసిన శ్రీకాంత్ ఓదెల ను కూడా సపోర్ట్ చేసి నానితో సినిమా చేసే విధంగా తనని ప్రోత్సహించాడు. ఇంకా వీళ్లే కాకుండా తన దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉన్న ప్రతి ఒక్కరిని డైరెక్టర్లుగా మార్చుతూ హిట్ కొట్టడానికి రెడీ అవుతున్నాడు ఇక తన నుంచి వచ్చిన ప్రతి డైరెక్టర్ కూడా మంచి సక్సెస్ లను అందుకుంటూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం అనే చెప్పాలి.
ఇక మిగితా ఏ డైరెక్టర్ల దగ్గర నుంచి వచ్చిన వాళ్ళ శిష్యులు కూడా ఇండస్ట్రీ లో సక్సెస్ లు సాధించడం లేదు కానీ ఒక్క సుకుమార్ దగ్గర నుంచి వచ్చిన డైరెక్టర్లు మాత్రమే సక్సెస్ లు కొడుతున్నారు కారణం ఏంటో ఎవరికి తెలియదు. కానీ సుకుమార్ మాత్రం తన శిష్యులను డైరెక్టర్ గా ప్రమోట్ చేస్తూ చాలా గొప్ప పని చేస్తున్నాడనే చెప్పాలి.
ఇక ఇండస్ట్రీ లో మొదటి సినిమా డైరెక్టర్ కి అవకాశం రావడం అంటే చాలా కష్టం ఈ ఒక్క ప్రొడ్యూసర్ కూడా ఆ డైరెక్టర్ ని నమ్మడు. కానీ సుకుమార్ తను సాహసం చేసి డబ్బులు ప్రొడ్యూసర్ల తో డబ్బులు పెట్టిస్తూ సుకుమార్ రైటింగ్స్ అనే ఒక టీమ్ ని ఏర్పాటు చేసుకొని తను సినిమాలు చేసుకుంటూనే తన దగ్గర వర్క్ చేస్తున్న వాళ్లకి కూడా ఒక లైఫ్ ని ఇవ్వాలనే ఉద్దేశ్యం తో తను ఇలాంటి కార్యక్రమాన్ని చేపడుతున్నట్టుగా తెలుస్తుంది…