Shankar And Prabhas: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన శంకర్ వరుసగా మంచి విజయాలను అందుకున్నాడు. అయితే తమిళ్ సినిమాలను తెలుగులో డబ్ చేసి ఇక్కడ కూడా ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక అందులో భాగంగానే ఇప్పుడు రామ్ చరణ్ తో గేమ్ చెంజర్ అనే స్ట్రైయిట్ తెలుగు సినిమాని చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది ఇక ఈ సినిమాని ఈ ఇయర్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
అయితే శంకర్ డైరెక్షన్ లో ప్రతి ఒక్క హీరో కనీసం వాళ్ళ ఎన్టీఆర్ కెరియర్ లో ఒక్కసారైనా నటించాలని కోరుకుంటారు. ఎందుకంటే శంకర్ సినిమాలో నటిస్తే ఆ హీరోకి సపరేట్ గా ఇమేజ్ వస్తుంది. రాజమౌళి కంటే ముందే శంకర్ పాన్ ఇండియా డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇలాంటి శంకర్ డైరెక్షన్ లో నటించడానికి ఆయన సినిమాలో ఏదైనా ఒక చిన్న క్యారెక్టర్ చేయడానికి అయిన పెద్ద పెద్ద నటులు సైతం పోటీ పడుతూ ఉంటారు. చాలా సంవత్సరాల పాటు సౌత్ సినిమా ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన ఏకైక వ్యక్తి శంకర్…
అయితే ఆయన గత సినిమాలు నిరాశపర్చినప్పటికీ ఇప్పుడు రామ్ చరణ్ తో చేస్తున్న గేమ్స్ చెంజర్ సినిమాతో సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకోబోతున్నాడు అనే వార్తలైతే వస్తున్నాయి. మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి మ్యాజిక్ చేస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా పూర్తి అయిన తర్వాత ప్రభాస్ తో సినిమా చేయాలనే ఆలోచనలో శంకర్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితిల్లో ప్రభాస్ రెండు సంవత్సరాల వరకు డేట్స్ ఖాళీగా లేకపోవడంతో ఆలోపు శంకర్ వేరే హీరోలతో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు.
అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం శంకర్ ప్రభాస్ కాంబినేషన్ లో సినిమా పడితే ఆ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేస్తుంది అనడం లో ఎంత మాత్రం అతిశక్తియోక్తి లేదు అంటూ చాలామంది సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. మరి వీళ్ళ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో తెలియాల్సి ఉంది…