https://oktelugu.com/

Nithiin – Teja: నితిన్, తేజకి మధ్య గొడవ జరగడానికి కారణం ఏంటో తెలుసా..?

చాలామంది కొత్త నటీనటులను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత కూడా తేజ కే దక్కుతుంది. అయితే గత కొంతకాలం నుండి ఈయన సరైన సక్సెస్ లను కొట్టలేకపోతున్నాడు.

Written By:
  • Gopi
  • , Updated On : March 19, 2024 / 09:55 AM IST

    Reason behind the fight between Nithiin and Teja

    Follow us on

    Nithiin – Teja: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొదటి నుంచి వైవిధ్యమైన సినిమాలను చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు తేజ…ఈయన చేసిన ఫస్ట్ సినిమా నుంచి మొన్న వచ్చిన అహింస సినిమా వరకు ప్రతి సినిమాలో కూడా ఏదో ఒక కొత్త కాన్సెప్ట్ అయితే ఉంటుంది. కెరియర్ స్టార్టింగ్ లో అయితే వరుసగా మూడు సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ ని కొట్టి యూత్ ను ఎక్కువగా అట్రాక్ట్ చేశాడు.

    ఇక దాంతో పాటుగా చాలామంది కొత్త నటీనటులను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత కూడా తేజ కే దక్కుతుంది. అయితే గత కొంతకాలం నుండి ఈయన సరైన సక్సెస్ లను కొట్టలేకపోతున్నాడు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇక జయం సినిమాతో సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకున్న తేజ నితిన్ కాంబినేషన్ లో ధైర్యం అనే మరొక సినిమా వచ్చింది. ఈ సినిమా టైం లోనే తేజ నితిన్ లా మధ్య కొన్ని క్లాషేష్ అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. ధైర్యం సినిమా ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత సినిమా మొత్తం చూసిన టీమ్ ఓకే సినిమా యావరేజ్ గా ఉంది అని అనుకున్నారట. కానీ తేజ మాత్రం కొన్ని సీన్స్ ని రీషుట్ చేద్దాం సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని చెప్పారట.

    కానీ దానికి నితిన్ వాళ్ళ నాన్న అయిన సుధాకర్ రెడ్డి మాత్రం ఇప్పటికే ఈ సినిమా మీద చాలా డబ్బులు ఖర్చు పెట్టాం, ఇక డబ్బులు లేవని చెప్పారట. దాంతో కోపానికి వచ్చిన తేజ ఈ సినిమాని కొనడానికి వచ్చిన డిస్ట్రిబ్యూటర్లతో సినిమా ఫ్లాప్ అవుతుంది తీసుకోకండి అని చెప్పారట. ఇక ఈ విషయం తెలిసిన నితిన్ తేజ తో గొడవ పెట్టుకున్నట్టుగా అప్పట్లో వార్తలైతే వచ్చాయి.

    ఇక అప్పటినుంచి ఇప్పటివరకు వాళ్ళిద్దరి మధ్య మాటలైతే లేవు. అందువల్లే తేజ చాలా మందితో సినిమాలు చేస్తున్నాడు కానీ నితిన్ తో మాత్రం సినిమా చేసే అవకాశాలు లేవు అంటూ ఒక ఇంటర్వ్యూలో చాలా క్లియర్ గా చెప్పాడు…