https://oktelugu.com/

Ante Sundaraniki OTT Date: అంటే సుందరానికి OTT రిలీజ్ డేట్ వచ్చేసింది

Ante Sundaraniki OTT Date: న్యాచురల్ స్టార్ నాని హీరో గా నజ్రియా హీరోయిన్ గా వివేక్ ఆత్రేయ దర్శకత్వం లో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘అంటే సుందరానికి’ సినిమా ఇటీవల విడుదలై డిజాస్టర్ ప్లాప్ గా నిలిచిన సంగతి మన అందరికి తెలిసిందే..తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో ఒక సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద ఫ్లాప్ గా నిలిచిన సినిమాలు గతం […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 20, 2022 / 01:35 PM IST
    Follow us on

    Ante Sundaraniki OTT Date: న్యాచురల్ స్టార్ నాని హీరో గా నజ్రియా హీరోయిన్ గా వివేక్ ఆత్రేయ దర్శకత్వం లో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘అంటే సుందరానికి’ సినిమా ఇటీవల విడుదలై డిజాస్టర్ ప్లాప్ గా నిలిచిన సంగతి మన అందరికి తెలిసిందే..తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో ఒక సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద ఫ్లాప్ గా నిలిచిన సినిమాలు గతం లో ఏమి లేవు..కానీ అంటే సుందరానికి సినిమా మాత్రం సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకొని కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద ఫ్లాప్ గా నిలిచి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది..విడుదలకి ముందు నుండి ఈ సినిమాకి సరైన బజ్ రాకపోవడం వల్లే ఈ సినిమాకి ఆశించిన స్థాయి వసూళ్లు రాలేదని ట్రేడ్ వర్గాల అంచనా..OTT రాజ్యం ఏలుతున్న సమయం లో ప్రేక్షకుడు థియేటర్ కి రావాలి అంటే మంచి పాటలు కచ్చితంగా ఉండాలని..అప్పుడు సహజంగానే జనాల్లో ఆసక్తి సొంతం చేసుకొని అద్భుతమైన ఓపెనింగ్స్ ని దక్కించుకుంటుంద అని ట్రేడ్ పండితుల అభిప్రాయం..అంటే సుందరానికి సినిమాకి వసూళ్లు రాకపోడానికి కారణం అదే అని తెలుస్తుంది.

    Ante Sundaraniki

    Also Read: Y S Sharmila: షర్మిల పాలేరులో గెలుస్తుందా? ప్రత్యర్థులెవరు? సేఫ్ నియోజకవర్గమేనా?

    ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కలిపి 30 కోట్ల రూపాయలకు జరిగిన సంగతి మన అందరికి తెలిసిందే..డిజిటల్ + సాటిలైట్ రైట్స్ కలిపి మరో 30 కోట్ల రూపాయిల బిజినెస్ చేసింది ఈ చిత్రం..ఇకపొతే ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ వారు భారీ మొత్తం లో కొనుగోలు చేసారు..మూవీ కలెక్షన్స్ దాదాపుగా క్లోసింగ్ కి వచ్చేయడం తో వచ్చే నెల మొదటి వారం లో కానీ..లేదా ఈ నెలాఖరున కానీ ఈ సినిమా OTT రిలీజ్ ఉంటుంది అట..థియేటర్స్ లో నిరాశ పరిచిన ఈ సినిమా బిజినెస్, కనీసం OTT నుండి అయినా లాభాలను ఆర్జిస్తుందో లేదో చూడాలి..పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా ఫామిలీ ఆడియన్స్ ఈ సినిమాని థియేటర్స్ లో చూడడానికంటే ఎక్కువగా OTT లో చూడడానికే ఆసక్తి ని చూపించారు..అందువల్ల ఈ సినిమా OTT ద్వారా కచ్చితంగా మంచి రీచ్ ని సొంతం చేసుకుంటుందని అంచనా..ఇది ఇలా ఉండగా ఈ సినిమా థియేటర్స్ నుండి కేవలం 17 కోట్ల రూపాయిల షేర్ ని మాత్రమే రాబట్టి బయ్యర్లకు 13 కోట్ల రూపాయిల నష్టాలను మిగిలించింది.

    Also Read: Pavan With People: జనంతో నే పవన్ పొత్తు.. టీడీపీ కే బొక్కా

    Tags