Homeఎంటర్టైన్మెంట్Online Ticket Portal Tender Issue: ఆ కాంట్రాక్ట్ మెగా ఫ్యామిలీకి వస్తుందా...

Online Ticket Portal Tender Issue: ఆ కాంట్రాక్ట్ మెగా ఫ్యామిలీకి వస్తుందా ? రాదా ?

Online Ticket Portal Tender Issue: మెగా ఫ్యామిలీ అంటే.. పరిశ్రమకు హీరోలను అందిస్తున్న ఫ్యామిలీ మాత్రమే కాదు.. సినిమా ఇండస్ట్రీలో ఎన్నో రకాలుగా మెగా ఫ్యామిలీ పాతుకుపోయింది. ఓటీటీ సంస్థ దగ్గర నుంచి నిర్మాణం, చివరకు డిస్ట్రిబ్యూషన్ కూడా మెగా ఫ్యామిలీకి చెందిన వ్యక్తులు చేస్తున్నారు. ఇందులో భాగంగానే జస్ట్ టిక్కెట్ అనే సంస్థ కూడా మెగా ఫ్యామిలీకి చెందిన వ్యక్తులదే.

Online Ticket Portal Tender Issue
Online Ticket Portal Tender Issue

కాగా ఏపీ ఆన్ లైన్ టిక్కెట్ల కాంట్రాక్ట్ ను ఈ జస్ట్ టిక్కెట్ సంస్థకి ఇవ్వాలని ప్లాన్ చేసింది ఏపీ ప్రభుత్వం. ఇందుకు అంతా సిద్ధమైందని కూడా ప్రచారం చేశారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచే జస్ట్ టిక్కెట్ సంస్థ నుంచే ఇక ఏపీ వాసులు టిక్కెట్లు కొనాలనేలా ఉత్తర్వులు జారీ చేస్తున్నారని కూడా ప్రచారం జరిగింది. అయితే, ఏప్రిల్ 1వ తేదీ వెళ్ళిపోయి నేటికీ మూడు రోజులైంది.

Also Read: Mudragada Padmanabham- ABN RK: అసలు అంశాలు వదిలి కొసరుపైనే క్లారిటీ.. ఇదేంది రాధాక్రిష్టగారు

కానీ.. జస్ట్ టిక్కెట్స్ సంస్థకి మాత్రం ప్రభుత్వం ఆన్ లైన్ టిక్కెట్ల కాంట్రాక్ట్ ను ఇవ్వలేదు. ప్రభుత్వానికి కూడా ఈ సంస్థకు కాంట్రాక్ట్ ఇవ్వడానికి అంగీకారమే అయినప్పుడు.. మరి ఎందుకు ఇంకా ఇవ్వలేదు అని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. కాంట్రాక్ట్ ను మీకే ఇస్తున్నాం అని జస్ట్ టిక్కెట్స్ సంస్థకి ప్రభుత్వ పెద్దలు నుంచి హామీ కూడా వచ్చింది. కానీ ఉత్తర్వులు మాత్రం ఇంకా వెలువడలేదు.

Online Ticket Portal Tender Issue
Online Ticket Portal Tender Issue

ఇప్పుడు ఇదే టాలీవుడ్‌లో హాట్ టాపిక్. ఏపీ ఆన్ లైన్ టిక్కెట్ల కాంట్రాక్ట్ ను ‘జస్ట్ టిక్కెట్స్‌’కు ఇంకా ఇవ్వకపోవడానికి మెయిన్ కారణం.. మరో సంస్థ కూడా పోటీలో ఉందట. ఏపీ ఆన్ లైన్ టిక్కెట్ల కాంట్రాక్ట్ కోసం ఆ సంస్థ.. ‘జస్ట్ టిక్కెట్స్’ కన్నా తక్కువ కమిషన్ తీసుకుంటామని ముందుకు వచ్చింది అట. పైగా ఆ సంస్థ తక్కువకే రివర్స్ టెండరింగ్ కూడా వేసింది.

ఈ కారణంగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేకపోతోందని.. రెండు సంస్థలతో చర్చలు జరిపి.. ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటే మంచిది అనే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.

Also Read:Sri Lanka Crisis: శ్రీలంక దుస్థితి ఏ దేశానికి రాకూడదా?

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు...

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ టీ తీసుకుంటే రోగాలకు దూరం ఉన్నట్లే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు, ఆహారం కలుషితం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుండడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి,...

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...
Oktelugu Epaper
Exit mobile version