https://oktelugu.com/

 ఒక్క ఐడియా.. మల్టీపెక్సుల తలరాతను మార్చనుందా?

  కరోనా ఎఫెక్ట్ తో సినిమారంగం కుదేలైపోయింది. షూటింగులు వాయిదాపడగా థియేటర్లు మూతపడ్డాయి. దీంతో ఈ రంగంపై ఆధారపడిన లక్షలాది కార్మికులు వీధినపడ్డారు. ఇప్పుడిప్పుడే సినిమా రంగం కోలుకుంటోంది. ఇటీవలే షూటింగులు ప్రారంభంకాగా.. థియేటర్లో ఓపెన్ అవుతున్నాయి. Also Read: సుడిగాలి సుధీర్ విషయంలో నిర్మాతల టెన్షన్ ! గడిచిన ఏడునెలలుగా థియేటర్లు మూతపడ్డాయి. దీంతో థియేటర్లలో సినిమాలు చూసే ప్రేక్షకులంతా టీవీలకు.. ఓటీటీలకు అలవాటు పడిపోయారు. దేశంలో ఇంకా కరోనా తగ్గుముఖం పట్టకపోవడంతో జనాలు ఇప్పట్లో […]

Written By:
  • NARESH
  • , Updated On : October 22, 2020 10:04 am
    Follow us on

     

    కరోనా ఎఫెక్ట్ తో సినిమారంగం కుదేలైపోయింది. షూటింగులు వాయిదాపడగా థియేటర్లు మూతపడ్డాయి. దీంతో ఈ రంగంపై ఆధారపడిన లక్షలాది కార్మికులు వీధినపడ్డారు. ఇప్పుడిప్పుడే సినిమా రంగం కోలుకుంటోంది. ఇటీవలే షూటింగులు ప్రారంభంకాగా.. థియేటర్లో ఓపెన్ అవుతున్నాయి.

    Also Read: సుడిగాలి సుధీర్ విషయంలో నిర్మాతల టెన్షన్ !

    గడిచిన ఏడునెలలుగా థియేటర్లు మూతపడ్డాయి. దీంతో థియేటర్లలో సినిమాలు చూసే ప్రేక్షకులంతా టీవీలకు.. ఓటీటీలకు అలవాటు పడిపోయారు. దేశంలో ఇంకా కరోనా తగ్గుముఖం పట్టకపోవడంతో జనాలు ఇప్పట్లో థియేటర్లకు వచ్చే పరిస్థితులు కన్పించడం లేదని తెలుస్తోంది.

    దీనికితోడు కేంద్రం ప్రభుత్వం కరోనా నిబంధనలు పాటిస్తూ థియేటర్లు ఓపెన్ చేయాలని మార్గదర్శకాలను విడుదల చేసింది. 50శాతం అక్యుపెన్సీతో థియేటర్లు నడుపుకోవాలని ప్రభుత్వాలు సూచించాయి. దీనిపై థియేటర్ల యాజమాన్యాలు పెదవి విరుస్తున్నాయి. ఇలా థియేటర్లు నడిపితే నిర్వాహణ ఖర్చులు కూడా రావని వాపోతున్నారు.

    సింగిల్ స్క్రీన్ థియేటర్లు టికెట్ ధర తగ్గించి ప్రేక్షకులను రప్పించాలని భావిస్తున్నాయి. అయితే ఈ నిర్ణయం మల్టిపెక్స్ లకు భారంగా మారనుంది. దీంతో మల్టిపెక్స్ నిర్వాహాకులు కొత్త ఐడియాతో ముందుకు వెళుతున్నారు. ఇకపై మల్టిపెక్సులను జనాలకే అద్దెకు ఇవ్వాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

    ఒక్కో స్క్రీన్ ని బుక్ చేసుకుని ప్రైవేటుగా స్క్రీనింగ్ చేసుకునేలా అవకాశాన్ని మల్టిపెక్సు నిర్వాహాకులు కల్పిస్తున్నారు. అద్దె తీసుకున్నవారు కొత్త సినిమాలను ప్రదర్శించుకోవడంతోపాటు బర్త్ డే పార్టీలు.. మూవీ ఈవెంట్స్.. వర్క్ షాపులు.. ఇతర ఫంక్షన్లకు వాడుకునే సదుపాయాలను కల్పిస్తున్నారు.

    Also Read: నిహారికను ఎప్పుడూ ఇలా చూడలేదట !

    ఈ ఐడియా వినడానికి బాగానే ఉన్నా భారీ మొత్తం చెల్లించి స్క్రీన్లని అద్దెకు తీసుకునేది ఎవరనే ప్రశ్న తలెత్తుతోంది? అయితే ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేసినట్లు ఇది వర్కౌట్ అయితే మాత్రం మల్టిపెక్సుల కష్టాలు తీరడం ఖాయంగా కన్పిస్తోంది. ఇది వర్కౌట్ అవుతుందో లేదో వేచిచూడాల్సిందే..!