https://oktelugu.com/

Chiranjeevi- VV Vinayak: డైరెక్టర్ వివి వినాయక్ ని ఆదుకున్న చిరంజీవి!… ఈ వార్త నిజమేనా?

Chiranjeevi- VV Vinayak: ఒకప్పటి స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ కి ఈ పరిస్థితి ఊహించనిదే. ఇండస్ట్రీలో సక్సెస్ మాత్రమే మాట్లాడుతుంది. బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ వివి వినాయక్ కి అవకాశాలు లేకుండా చేశాయి. మాస్ కమర్షియల్ చిత్రాల దర్శకుడిగా అప్పట్లో వివి వినాయక్ సంచలనాలు నమోదు చేశారు. వినాయక్ డెబ్యూ మూవీ ఆది బ్లాక్ బస్టర్ హిట్. రెండవ చిత్రం బాలయ్యతో చెన్నకేశవరెడ్డి హిట్. యంగ్ హీరో నితిన్ తో చేసిన దిల్ సూపర్ […]

Written By:
  • Shiva
  • , Updated On : June 19, 2022 / 11:22 AM IST
    Follow us on

    Chiranjeevi- VV Vinayak: ఒకప్పటి స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ కి ఈ పరిస్థితి ఊహించనిదే. ఇండస్ట్రీలో సక్సెస్ మాత్రమే మాట్లాడుతుంది. బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ వివి వినాయక్ కి అవకాశాలు లేకుండా చేశాయి. మాస్ కమర్షియల్ చిత్రాల దర్శకుడిగా అప్పట్లో వివి వినాయక్ సంచలనాలు నమోదు చేశారు. వినాయక్ డెబ్యూ మూవీ ఆది బ్లాక్ బస్టర్ హిట్. రెండవ చిత్రం బాలయ్యతో చెన్నకేశవరెడ్డి హిట్. యంగ్ హీరో నితిన్ తో చేసిన దిల్ సూపర్ హిట్ కొట్టింది. వినాయక్ నాలుగవ చిత్రం ఠాగూర్ ఏకంగా ఇండస్ట్రీ హిట్ కొట్టింది.

    Chiranjeevi- VV Vinayak

    ఓ దశలో దర్శకుడు రాజమౌళితో పోటీపడ్డ ఆయన రేసులో వెనుకబడ్డారు. వినాయక్ చివరి చిత్రం ఇంటెలిజెంట్. సాయి ధరమ్ హీరోగా 2018లో విడుదలైన ఈ మూవీ ఓ డిజాస్టర్. వివి వినాయక్ కి పరిశ్రమలో ఉన్న పలుకుబడి, ట్రాక్ రికార్డు రీత్యా అవకాశాలు రావాల్సింది. కానీ అలా జరగడం లేదు. హీరో ఎన్టీఆర్ వినాయక్ కి చాలా క్లోజ్. ఆది చిత్రంతో ఎన్టీఆర్ కి వినాయక్ మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టారు. అలాగే అదుర్స్ లాంటి సూపర్ హిట్ ఇచ్చాడు. ఎన్టీఆర్ కూడా వినాయక్ ని పట్టించుకోలేదు.

    Also Read: Leak On Jailor Movie Story: రజినీకాంత్ ‘జైలర్’ స్టోరీ లీక్… ఇండస్ట్రీ హిట్ ఖాయం!

    చేసేది లేక ఆ మధ్య వినాయక్ హీరో అవతారం ఎత్తాడు. శీనయ్య టైటిల్ తో ఓ మూవీ ప్రకటించారు. దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కాల్సిన ఈ మూవీ ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. కారణం తెలియదు కానీ దిల్ రాజు ఆ ప్రాజెక్ట్ పక్కన పెట్టేశారు. ఆఫర్స్ లేక ఖాళీగా ఉన్న వివి వినాయక్ ని మెగాస్టార్ చిరంజీవి ఆదుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. వినాయక్ తో మూవీకి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. చిరంజీవి-వినాయక్ కాంబినేషన్ లో మూవీ ఖాయమే అంటూ టాలీవుడ్ టాక్.

    Chiranjeevi- VV Vinayak

    వీరిద్దరి ట్రాక్ కూడా బ్లాక్ బస్టర్ హిట్. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ్ రీమేక్ ఠాగూర్ ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఆ మూవీలో చిరంజీవిని వినాయక్ ప్రజెంట్ చేసిన విధానం ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. అలాగే చిరంజీవి కమ్ బ్యాక్ మూవీ ఖైదీ 150కి సైతం వివి వినాయక్ దర్శకుడిగా ఉన్నారు. 2017లో విడుదలైన ఖైదీ 150 నయా రికార్డ్స్ నమోదు చేసింది. ఈ క్రమంలో ఈ కాంబినేషన్ పట్ల ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. పరిశ్రమ మర్చిపోతున్న తరుణంలో చిరంజీవి వివి వినాయక్ కి ఆఫర్ ఇచ్చి ఆదుకున్నాడనేది ఇండస్ట్రీ వర్గాల మాట. దీనిపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.

    Also Read:Pooja Hegde: బ్రా లేదు పైగా బటన్స్ తీసేసింది… పూజా అందాల అరాచకానికి క్రేజీగా ఫీల్ అవుతున్న ఫ్యాన్స్!

    Tags