Vishwak Sen: హీరో విశ్వక్ సేన్ వివాదాలతో కాపురం చేస్తుంటాడు. పరిశ్రమకు వచ్చిన నాటి నుండి మనోడి మీద లెక్కకు మించిన వివాదాలు ఉన్నాయి. ఫలక్ నూమా దాస్ మూవీ సమయంలో విజయ్ దేవరకొండ తన మూవీ పోస్టర్స్ చించించాడని ఆరోపణలు చేశాడు. ఎవడినీ వదిలేది లేదని పరుష వ్యాఖ్యలు చేశాడు. టీవీ 9 యాంకర్ దేవి నాగవల్లితో ఒక గొడవ. ఆమె గెట్ అవుట్ అని విశ్వక్ సేన్ పైన ఫైర్ అయ్యింది.
కాగా బేబీ మూవీ ఫేమ్ సాయి రాజేష్ తో కొన్నిరోజులు వివాదం నడిచింది. ఇద్దరికీ మధ్య మాటల యుద్ధం జరిగింది. బేబీ బ్లాక్ బస్టర్ హిట్ కాగా… ఈ మూవీ కథ చెప్పడానికి వెళితే, ఒక హీరో కనీసం కథ వినలేదు. రిజెక్ట్ చేశాడని, సాయి రాజేష్ ఓ ఇంటర్వ్యూలో అన్నాడు. ఈ కామెంట్ పై విశ్వక్ సేన్ పరోక్షంగా స్పందించాడు. హిట్ ఎంజాయ్ చేయకుండా ఈ కామెంట్స్ ఎందుకంటూ సెటైర్ వేశాడు.
తర్వాత బేబీ కథ రిజెక్ట్ చేసింది తానేనని విశ్వక్ సేన్ ఒప్పుకున్నాడు. ఆ వివాదంలో సాయి రాజేష్, విశ్వక్ సేన్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేసుకున్నారు. ఆ వివాదం ముగియగా విశ్వక్ సేన్ మరో వివాదం తెరపైకి తెచ్చాడు. ఇటీవల కల్ట్ బొమ్మ టైటిల్ తో సాయి రాజేష్ మూవీ ప్రకటించాడు. ఎస్కేఎన్ నిర్మాత. కల్ట్ బొమ్మ టైటిల్ ని ఎస్కేఎన్ రిజిస్టర్ చేయించాడు.
తాజాగా విశ్వక్ సేన్ ఈ టైటిల్ కి దగ్గరగా మరో మూవీ ప్రకటించాడు. కల్ట్ పేరుతో మూవీ నిర్మిస్తున్నట్లు వెల్లడించాడు. కొత్తవాళ్లు నటించే ఈ మూవీకి విశ్వక్ సేన్ నిర్మాత కాగా… తాజుద్దీన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. సాయి రాజేష్ మూవీ టైటిల్ ని కాపీ కొట్టినట్లు కల్ట్ ఉంది. ఈ క్రమంలో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కల్ట్ బొమ్మ నిర్మాతలు కంప్లైంట్ చేయనున్నారని సమాచారం. కల్ట్ చిత్ర టైటిల్ విషయంలో సాయి రాజేష్ ని విశ్వక్ సేన్ మరోసారి గెలికినట్లు అయ్యింది.