National Film Day : కేవలం 99 రూపాయలకే మల్టీప్లెక్స్ సినిమా.. మూవీ లవర్స్ కి ఇక పండగే..ఎప్పటి నుండి అమలు అంటే!

గతంలో జాతీయ సినిమా దినోత్సవం నాడు ఇలాగే 99 రూపాయిల టికెట్ రేట్స్ పెట్టినప్పుడు బ్రహ్మాస్త్ర సినిమా థియేటర్స్ లో నడుస్తుంది. ఈ చిత్రానికి 99 టికెట్ రేట్ బాగా కలిసొచ్చింది. మరి ఇప్పుడు నడుస్తున్న చిత్రాలు ఎంతమేరకు ఈ ఆఫర్ ని ఉపయోగించుకుంటాయో చూడాలి.

Written By: Vicky, Updated On : September 19, 2024 5:55 pm

September 20th, National Film Day

Follow us on

National Film Day : ప్రస్తుతం సినిమా అనే ఎంటర్టైన్మెంట్ మన ఆడియన్స్ కి ఎంత కాస్ట్లీ గా మారిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కుటుంబం మొత్తం కలిసి మల్టీప్లెక్స్ లో ఒక సినిమా చూడాలంటే వెయ్యి రూపాయలకు పైగా ఖర్చు అవుతుంది. సినిమా అంటే విపరీతమైన ఇష్టం ఉన్నవారు ఎంత ఖర్చు అయినా చేస్తారు. కానీ సినిమా అనే ఎంటర్టైన్మెంట్ ని కేవలం ఒక ఛాయస్ గా మాత్రమే చూసే ప్రేక్షకులు మాత్రం థియేటర్ కి రావడం మానేశారు. దానికి తోడు ఇప్పుడు ఓటీటీ కూడా అందుబాటులోకి రావడం, థియేటర్స్ లో విడుదలైన సినిమాలు కేవలం రెండు మూడు వారాల్లోపే ఓటీటీలోకి రావడం తో ఆడియన్స్ దానిని ఎంచుకున్నారు. ఓటీటీ కారణంగా సినీ పరిశ్రమ తీవ్రమైన సంక్షోభంలో పడిన సంగతి మన అందరికీ తెలిసిందే.

థియేటర్స్ కొంతకాలం మూత కూడా పడ్డాయి. నిర్మాతలు షూటింగ్స్ ని కొంతకాలం వరకు పూర్తి స్థాయిలో ఆపేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. పైగా ఇప్పుడు స్టార్ హీరోలు పాన్ ఇండియన్ చిత్రాల మోజులో పడడంతో రెండేళ్లకు ఒక్కసారి సినిమాలను విడుదల చేస్తున్నారు. దీంతో థియేటర్స్ బిజినెస్ పూర్తిగా పడిపోయింది, చిన్న సినిమాలు, మీడియం రేంజ్ సినిమాల మీదనే థియేటర్స్ ఆధారపడాల్సి వచ్చింది. ఇలాంటి క్రమంలో ఇప్పుడు మూవీ లవర్స్ కి ఒక గుడ్ న్యూస్. పూర్తి వివరాల్లోకి వెళ్తే సెప్టెంబర్ 20 వ తేదీన జాతీయ సినిమా దినోత్సవం ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆడియన్స్ కి కేవలం 99 రూపాయలకే సినిమాని చూసే అదృష్టం కల్పించింది మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కల్పించింది. ఈమేరకు కాసేపటి క్రితమే అధికారిక ప్రకటన చేసారు. అయితే ఇందులో ఒక చిన్న మెలిక ఉంది. 99 రూపాయలకు కేవలం 2D వెర్షన్ సినిమాలను మాత్రమే వీక్షించగలరు. అంతే కానీ అదే 99 రూపాయలతో 3D,రిక్లైనర్స్,ప్రీమియం ఫార్మటు సినిమాలను వీక్షించడానికి సాధ్యం అవ్వదు. సెప్టెంబర్ 20 న అన్ని సినిమాలకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ టికెట్ రేట్స్ 99 రూపాయలకు మార్చారు. బుక్ మై షో,పేటీఏం తదితర యాప్స్ ద్వారా బుకింగ్స్ చేసుకోవచ్చు.

ప్రస్తుతం థియేటర్స్ లో సరిపోదా శనివారం, ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం, స్త్రీ2 , మత్తు వదలరా 2 ఇలా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు విజయవంతంగా థియేటర్స్ లో నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రాల వసూళ్లు రేపు భారీ గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే స్త్రీ 2 చిత్రం ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపుగా 600 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు రాబట్టింది. 20 వ తేదీ ఈ టికెట్ రేట్స్ కారణంగా ఆ చిత్రానికి 10 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. గతంలో జాతీయ సినిమా దినోత్సవం నాడు ఇలాగే 99 రూపాయిల టికెట్ రేట్స్ పెట్టినప్పుడు బ్రహ్మాస్త్ర సినిమా థియేటర్స్ లో నడుస్తుంది. ఈ చిత్రానికి 99 టికెట్ రేట్ బాగా కలిసొచ్చింది. మరి ఇప్పుడు నడుస్తున్న చిత్రాలు ఎంతమేరకు ఈ ఆఫర్ ని ఉపయోగించుకుంటాయో చూడాలి.