https://oktelugu.com/

ఆదిపురుష్‌ మొదలయ్యేది ఎప్పుడంటే..?

ఐదేళ్లు బాహుబలి సిరీస్‌కు, రెండేళ్లు సాహోకు కేటాయించిన యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ ఇప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు. సాహో అనంతరం చేస్తున్న ‘రాధేశ్యామ్‌’ షూటింగ్‌ ఇంకా పూర్తి కాకముందే మరో రెండు పాన్‌ ఇండియా సినిమాలు ఒప్పుకున్నాడు. ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం అశ్వినీదత్‌ నిర్మించే ప్రతిష్టాత్మక చిత్రంలో భాగం కానున్నాడు. ఇందులో బాలీవుడ్‌ స్టార్ దీపిక పడుకోన్‌ హీరోయిన్‌గా నటించనుంది. ఈ చిత్రాన్ని ప్రకటించిన కొన్ని […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 25, 2020 / 08:05 PM IST
    Follow us on


    ఐదేళ్లు బాహుబలి సిరీస్‌కు, రెండేళ్లు సాహోకు కేటాయించిన యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ ఇప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు. సాహో అనంతరం చేస్తున్న ‘రాధేశ్యామ్‌’ షూటింగ్‌ ఇంకా పూర్తి కాకముందే మరో రెండు పాన్‌ ఇండియా సినిమాలు ఒప్పుకున్నాడు. ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం అశ్వినీదత్‌ నిర్మించే ప్రతిష్టాత్మక చిత్రంలో భాగం కానున్నాడు. ఇందులో బాలీవుడ్‌ స్టార్ దీపిక పడుకోన్‌ హీరోయిన్‌గా నటించనుంది. ఈ చిత్రాన్ని ప్రకటించిన కొన్ని రోజులకే మన డార్లింగ్‌ మరో భారీ ప్రాజెక్టుకు ఓకే చెప్పాడు. తానాజీ ఫేం ఓం రౌత్‌ డైరెక్షన్‌లో ‘ఆదిపురుష్‌’లో హీరోగా నటించనున్నాడు.

    Also Read: రాశి ఖన్నా డేరింగ్‌ స్టెప్‌..

    అనూహ్యంగా ప్రకటించిన ఈ మూవీతో ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్‌ ఇచ్చాడు రెబల్‌ స్టార్. రామాయణ ఇతివృత్తంతో తెరకెక్కే ఈ చిత్రంలో ప్రభాస్‌ రాముడిగా కనిపించబోతున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ టీ సిరీస్‌ ప్రొడ్యూస్‌ చేస్తుండడంతో బాలీవుడ్‌ దృష్టంతా ఇప్పుడు ఈ సినిమాపైనే ఉంది. ఈ భారీ ప్రాజెక్టు రోజూ వార్తల్లో నానుతోంది. సినిమా గురించి రోజుకో విషయం తెలుస్తోంది. ఈ మూవీలో ప్రభాస్‌కు జోడీగా జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేశ్‌ను సీత పాత్ర కోసం పరిశీలిస్తున్నారని వార్తలు వచ్చాయి. విలన్‌గా బాలీవుడ్‌ స్టార్ సైఫ్‌ అలీఖాన్‌ నటిస్తాడని అంటున్నారు. అలాగే, ఈ మూవీ రూ. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుందని తెలిసింది. తాజాగా, సీత పాత్ర కోసం కీర్తిని కాకుండా కియారా ఆడ్వాణీ పేరు పరిశీలిస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి.

    Also Read: భారీ ఆఫర్ను కాదనుకున్న మెగా హీరో!

    మరోవైపు పూర్తిగా త్రీడీలో తెరకెక్కబోయే ఈ సినిమా షూటింగ్‌ ఎప్పుడు మొదలవుతుందనే కుతూహలం అభిమానుల్లో పెరిగింది. ఒకవైపు ‘రాధేశ్యామ్‌’ షూటింగ్‌ ఇంకా పూర్తికాలేదు. మరోవైపు నాగ్‌ అశ్విన్‌ కథ, కథనం సిద్ధం చేసి చిత్రీకరణ జరిపేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సైన్స్‌ ఫిక్షన్‌ ప్రాజెక్టు కంప్లీట్‌ అయ్యేందుకు కనీసం ఒకటిన్నర సంవత్సరాలైనా పడుతుందని అంటున్నారు. అయినా మరో ప్రాజెక్టుకు రెబల్‌ స్టార్ ఒప్పుకున్నాడు. మరి, ప్రభాస్‌ చేస్తున్న తొలి హిందీ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందనేది చర్చనీయాంశమైంది. దీనిపై దర్శకుడు ఓం రౌత్ స్పష్టత ఇచ్చాడు. ఆదిపురుష్‌ షూటింగ్‌ వచ్చే ఏడాది జనవరిలోనే మొదలవుతుందని స్పష్టం చేశాడు. చిత్రీకరణ తొందరగానే ముగిసినా.. విజ్యువల్‌ ఎఫెక్ట్స్‌ పూర్తి చేసి రిలీజ్‌ చేసేందుకు చాలా టైమ్‌ పడుతుందని తెలుస్తోంది. ఈ లెక్కన ఆదిపురుష్ 2022 సెకండాఫ్‌లో రిలీజ్‌ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ లెక్కన నాగ్‌ అశ్విన్‌ సైన్స్‌ ఫిక్షన్‌ ప్రాజెక్టు కొంతకాలం వాయిదా పడుతుందా?