
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం నిన్న దసరా సందర్బంగా అధికారికంగా ప్రకటించబడింది. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో ఈ సినిమా ఉండనుంది. మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియం’కు తెలుగు రీమేక్ ఈ చిత్రం. ఇందులో పవన్ ఒరిజినల్ వెర్షన్లో బిజూ మీనన్ చేసిన పోలీస్ పాత్ర చేయనున్నారు. అయితే మళయాళ వెర్షన్, తమిళ వెర్షన్ మధ్య చాలా తేడా ఉంటుందట. ముఖ్యంగా పవన్ పాత్రలో.
Also Read: పిల్ల దొరక లేదు గానీ.. పెళ్లికి రెడీ అంటున్న తేజు.. !
దాన్ని తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు మార్పులు చేర్పులు చేసి మరో గబ్బర్ సింగ్ తరహాలో డిజైన్ చేశారట. సినిమాలో హైఓల్టేజ్ యాక్షన్, పవన్ మార్క్ ఎంటర్టైన్మెంట్ ఖాయమని అంటున్నారు. ఇకపోతే ఈ సినిమాకు ఒకప్పటి చిరంజీవి చిత్రం ‘బిల్లా రంగా’ టైటిల్ ను వాడుకోవాలనే యోచనలో ఉన్నారట దర్శక నిర్మాతలు. లేటెస్ట్ టాక్ మేరకు పవన్ పేరు బిల్లా కాగా రానా పేరు రంగా అంటున్నారు. అయితే ఇది ఎంతవరకు నిజం అనేది ఇంకా తేలాల్సి ఉంది. ఒకవేళ అదే నిజమైతే ఇన్నాళ్లు అన్నయాయను పెద్దగా వాడని పవన్ ఈసారి వాడేసినట్టే అవుతుంది.
Also Read: ‘డార్క్’ వెబ్ సిరీస్ వెనుక మహేష్ హస్తం ఉందా?
‘వకీల్ సాబ్’ షూటింగ్ ముగియగానే ఈ సినిమా మొదలుకానుంది. నవంబర్, డిసెంబర్ నాటికి షూటింగ్ పూరయ్యేలా పక్క ప్లాన్ సిద్ధం చేశారు. అయితే ఒరిజినల్ వెర్షన్లో హీరోయిన్ల ఎఫెక్ట్ సినిమాలో పెద్దగా ఉండదు. కానీ తెలుగులో ఉండొచ్చని అంటున్నారు. మరి పవన్ కు జోడీగా ఎవర్ని తీసుకుంటారో చూడాలి. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం సమకూరుస్తున్నారు.
Comments are closed.