
తెలుగు రియల్టీ షోలో బిగ్ బాస్ నెంబర్ వన్ గా కొనసాగుతోంది. గత సీజన్(బిగ్ బాస్-3)కి హోస్టుగా చేసిన నాగార్జునే బిగ్ బాస్-4కు కూడా చేస్తున్నాడు. బిగ్ బాస్-3 సమయంలోనూ కింగ్ నాగార్జున కొద్దిరోజులు బ్రేక్ తీసుకున్నాడు. అప్పుడు ఆయన ప్లేసులో ఒక ఎపిసోడ్ కు సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ చేసింది.
Also Read: బిగ్ బాస్-4: మొనాల్ తో హైపర్ ఆది పులిహోర.. నవ్వకుండా ఉండలేరు?
రమ్యకృష్ణ చేసింది ఒకే ఎపిసోడ్ చేసినా నాగార్జునను మైమరిపించింది. బిగ్ బాస్-3లో రమ్యకృష్ణ ఎపిసోడ్ హైలెట్ గా నిలిచింది. ఒక్క ఎపిసోడ్ తోనే రమ్యకృష్ణ తానేంటో నిరూపించుకొని అభిమానులను అలరించింది. తాజాగా సీజన్లోనూ నాగార్జున తన ‘వైల్డ్ డాగ్’ సినిమా కోసం కూలుమనాలికి వెళ్లాడు.
దీంతో నాగార్జున ప్లేసులో ఆయన కోడలు అక్కినేని సమంత వచ్చింది. కింగ్ నాగార్జున షూటింగు నుంచి తిరిగి వచ్చేదాకా సమంతనే హోస్టుగా చేయనుంది. మొదటి ఎపిసిడ్లోనే ఆమెతో కంటెస్టులను తిట్టంచడం బాగోదనే దసరాకు ఆమెతో స్పెషల్ కార్యక్రమం చేశారు. ఈ ఎపిసోడ్లో సమంత తనలోని ఛార్మ్.. హ్యుమర్ ను చూపించింది.
ఇక తెలుగు భాషపై పెద్దగా పట్టుకోలేక సమంత కొద్దిగా తడబడింది. అదేవిధంగా చాలా ఎమోనల్ గా కన్పించింది. కంటెస్టులు ఏడుస్తుంటే తాను కూడా ఎమోషనల్ అవుతూ కన్పించింది. బిగ్ బాస్ హోస్ట్ ఇంత సింపుల్ గా ఉంటే కుదరదు. కంటెస్టులతో రఫ్ అండ్ టఫ్ ఉంటూ వారికి క్లాసులు పీకాల్సి ఉంటుంది.
దీంతో రానున్న ఎపిసోడ్స్ లో సమంత తనలోని సీరియస్ యాంగిల్ చూపించాల్సి ఉంటుంది. కాగా నిన్న జరిగిన దసరా స్పెషల్ ఎపిసోడ్లో సమంతకు తోడుగా అఖిల్.. హైపర్ ఆది.. పాయల్ రాజ్ పుత్.. కార్తీకేయ వంటి అతిథులు రావడంతో సమంత పని చాలా ఈజీ ఐయిపోయింది.
Also Read: సంక్రాంతికి హౌస్ ఫుల్ బోర్డ్.. కానీ అదొక్కటే మైనస్..!
అయితే నాగార్జునతో పోల్చుకుంటే సమంత హోస్ట్ సోసోగానే అనిపించింది. నాగార్జున హుషారు.. కోడలు సమంతలో కన్పించలేదని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. రానున్న ఎపిసోడ్స్ లోనైనా సమంత మామను మరిపిస్తుందో లేదో వేచిచూడాల్సిందే..!