Telugu Movies Old Formula: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగుతున్నారు. అయితే కొన్ని సంవత్సరాలకు ఒకసారి సినిమాలు తీసే ట్రెండ్ మారుతోంది అనే విషయం మనందరికి తెలిసిందే…ఒకప్పుడు మంత్రాలు,తంత్రాలు, దయ్యాలు, భూతాలు అంటూ హంగుపు ఆర్భాటాలతో సినిమాలను చేశారు. మధ్యలో కమర్షియల్ సినిమాలు రాజ్యమేలుతుండడంతో ప్రతి ఒక్క దర్శకుడు స్టార్ హీరో అందరు కమర్షియల్ సినిమాలను చేస్తూ సూపర్ సక్సెస్ లను సాధించారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. మరోసారి పాత వైఖరిని అనుసరిస్తూ నల్ల కోడి, పసుపు, కుంకుమ అమావాస్య రాత్రులు, కటిక చీకటి, దెయ్యం లాంటి వాటిని అనుసరించి కథలను రాసుకొని మంత్రాలు తంత్రాలతో సినిమాలను సూపర్ హిట్టుగా మారుస్తున్నారు. మరి ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలన్నీ కూడా అలాంటి సినిమాలే కావడం విశేషం…ముఖ్యంగా పొలిమేర సినిమాతో ఊర్లో చేసే చేతబడుల ను బేస్ చేసుకొని తెరకెక్కి మంచి విజయాన్ని సాధించింది. ఇక ఈ సినిమా తర్వాత సాయిధరమ్ తేజ్ హీరోగా వచ్చిన వీరూపాక్ష సినిమా కూడా మంత్రాలు మాయలతో ఘన విషయాన్ని అందుకుంది…
Also Read: ఇన్ స్టాగ్రామ్ మొత్తాన్ని ఊపేస్తున్న నాగార్జున ‘సైమన్’ మేనియా..ఇదేమి క్రేజ్ బాబోయ్!
గతంలో అరుంధతి లాంటి సినిమా కూడా ఇలాంటి కాన్సెప్ట్ లతో వచ్చి సూపర్ సక్సెస్ లను సాధించాయి. ఇక ఇప్పుడు ప్రభాస్ హీరోగా వస్తున్న రాజాసాబ్ సినిమా కూడా ఇలాంటి సినిమానే కావడం విశేషం…ముఖ్యంగా దయ్యాలు, భూతాలను బేస్ చేసుకొని రాబోతున్న ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు.
తద్వారా ప్రభాస్ ఇమేజ్ తారా స్థాయికి వెళ్తుందా? లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది… మరి ఒకప్పటి ట్రెండు మళ్ళీ తీసుకొస్తూ సినిమాలను సక్సెస్ చేస్తున్న మన దర్శకులు వాళ్లకి ఎలాంటి అంశాలు కావాలో వాటిలో అలాంటి అంశాలను నింపుతూ చిన్న హీరో, పెద్ద హీరో అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరితో ఈ జానర్ లో సినిమాలను చేస్తూ విజయాలను సాధించాలని కోరుకుంటున్నారు.
మరి ఇలాంటి సందర్భంలో ఈ సినిమాలు ఇంకా ఎన్ని రోజుల పాటు ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా ఉంటాయి అనేది ఇప్పుడు చర్చనీయంశముగా మారింది. ఇకమీదట మన దర్శకులు సైతం జానర్ లను మార్చాల్సిన సమయం అయితే ఆసన్నమైందనేడి చాలా స్పష్టంగా తెలుస్తోంది. చూడాలి మరి రాబోయే సినిమాల విజయాల మీదనే ఈ జానర్స్ మారుస్తారా? లేదంటే ఇవే జానర్ లను ఇంకా కంటిన్యూ చేస్తూ సినిమాలు చేస్తారా అనేది తెలియాల్సి ఉంది…