OKtelugu MovieTime : మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ టాలీవుడ్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా కన్నడలో విడుదల చేసిన తొలి నాలుగు రోజుల్లోనే రూ.40 కోట్ల కలెక్షన్స్ సాధించిన చిత్రం ‘కే3 కోటికొక్కడు’. రెండు విభిన్న పాత్రలలో కథానాయకుడిగా సుదీప్, హీరోయిన్స్ గా మడోన్నా, శ్రద్ధాదాస్ తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. శ్రేయాస్ శ్రీనివాస్, దేవేంద్ర డీకే సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 4న తెలుగులో విడుదల చేయనున్నట్లు చిత్ర సిబ్బంది తెలిపింది.
ఇక మరో అప్ డేట్ విషయానికి వస్తే.. గతేడాది యూట్యూబ్లో సూపర్హిట్గా నిలిచిన ’30 వెడ్స్ 21′ వెబ్సిరీస్.. సీజన్ 2కి రెడీ అవుతోంది. ఈ మేరకు ఫస్ట్లుక్ను విడుదల చేసింది నిర్మాణ సంస్థ చాయ్ బిస్కెట్. టీజర్ను జనవరి 31న రిలీజ్ చేయనున్నారు. ప్రీటీజర్ను విడుదల చేసి.. సీజన్1ను గుర్తుచేశారు. 30 ఏళ్ల యువకుడికి 21 ఏళ్ల అమ్మాయితో పెళ్లి జరిగితే, వారి మధ్య భావోద్వేగాలు ఎలా ఉంటాయనే కథాంశాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దారు మేకర్స్.
Also Read: పవన్ కళ్యాణ్ పై మళ్లీ తన పైత్యం చూపించిన వర్మ !
ఇక మరో అప్ డేట్ కి వస్తే.. బాలీవుడ్‌లో వంద కోట్ల వసూళ్లు అనేది ఏ హీరోకైనా ఓ మైలురాయి. అలాంటిది ఓ డబ్బింగ్ చిత్రంతో అల్లు అర్జున్ ఈ ఘనతను అందుకోబోతున్నాడు. అదీ కింగ్‌లా. ప్రస్తుతం పుష్ప అన్ని భాషల్లో ఓటీటీలో రన్ అవుతోంది. అయినా నార్త్ ఆడియన్స్ థియేటర్లకి వెళ్లి చూస్తుండడం ట్రేడ్ పండితులనే ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర హిందీ వసూళ్లు రూ. 97.75 కోట్లు ఉండగా 7వ వారం పూర్తయ్యేలోపు రూ. 100 కోట్లకి చేరుకోనుంది.
Also Read: Sai Pallavi: సాయిపల్లవి వివాదం: స్పందించిన గవర్నర్ తమిళిసై.. అసలు వివాదమేంటి ?