https://oktelugu.com/

Ram Gopal Varma: పవన్ కళ్యాణ్ పై మళ్లీ తన పైత్యం చూపించిన వర్మ !

Ram Gopal Varma: వివాదాలతో బతుకుతూ ఎప్పుడూ ఎవరో ఒకర్ని వెటకారంగా తిడుతూ విమర్శిస్తూ తన శేష జీవితాన్ని నెట్టుకొస్తున్న జీవి.. ‘ఆర్జీవీ’. ఏది ఏమైనా అందరి దృష్ణినీ తన వైపుకు తిప్పుకోవడంలో ఆర్జీవీ మహా దిట్ట. వర్మ… తాజాగా మరోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ ను నెలికాడు. పవన్ పై వెటకారంగా ట్వీట్స్ చేసి మొత్తానికి పవన్ ఫ్యాన్స్ కు ఆగ్రహం తెప్పించే పనిని పవర్ ఫుల్ గా చేశాడు. ఇంతకీ వర్మ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 31, 2022 / 11:12 AM IST
    Follow us on

    Ram Gopal Varma: వివాదాలతో బతుకుతూ ఎప్పుడూ ఎవరో ఒకర్ని వెటకారంగా తిడుతూ విమర్శిస్తూ తన శేష జీవితాన్ని నెట్టుకొస్తున్న జీవి.. ‘ఆర్జీవీ’. ఏది ఏమైనా అందరి దృష్ణినీ తన వైపుకు తిప్పుకోవడంలో ఆర్జీవీ మహా దిట్ట. వర్మ… తాజాగా మరోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ ను నెలికాడు. పవన్ పై వెటకారంగా ట్వీట్స్ చేసి మొత్తానికి పవన్ ఫ్యాన్స్ కు ఆగ్రహం తెప్పించే పనిని పవర్ ఫుల్ గా చేశాడు.

    Ram Gopal Varma on Twitter

    ఇంతకీ వర్మ ట్వీట్స్ లో ఏమి పోస్ట్ చేశాడు అంటే.. ‘ఇంటీరియర్ ఆంధ్ర లో జరిగిన పుష్ప సబ్జెక్ట్ పాన్ ఇండియా సబ్జెక్ట్ అయినప్పుడు, కొమరం భీమ్, అల్లూరి లాంటి తెలుగు వీరుల సబ్జెక్ట్ పాన్ ఇండియా అయినప్పుడు, భీమ్లా నాయక్ సబ్జెక్ట్ పాన్ వరల్డ్ సబ్జెక్ట్ కాదంటారా పవన్ కళ్యాణ్ గారూ?’ ‘ఎప్పుడో మీ తర్వాత వచ్చిన పిల్లలు తారక్, రామ్ చరణ్ కూడా పాన్ ఇండియా స్టార్స్ అయిపోతూ ఉంటే, మీరు ఇంకా ఒట్టి తెలుగు ని పట్టుకుని వేలాడటం మీ ఫ్యాన్స్ అయిన మాకు కన్నీటి ప్రాయంగా ఉంది.

    Also Read: సై మూవీలో ఆఫ‌ర్ ఇచ్చిన రాజమౌళి.. నో చెప్పిన స్టార్ హీరో.. ఎవ‌రంటే..?

    దయచేసి భీమ్లా నాయక్ ని పాన్ ఇండియా తీసుకెళ్ళి మీరే సబ్కా బాప్ అని ప్రూవ్ చెయ్యండి’.‘పుష్ప యే అంత చేస్తే పవర్ స్టార్ అయిన మీరు నటించిన భీమ్లా నాయక్ ఇంకా ఎంత కలెక్ట్ చెయ్యాలి? .. పాన్ ఇండియా సినిమా లాగా రిలీజ్ చెయ్యకపోతే మీ ఫ్యాన్స్ అయిన మేమంతా బన్నీ ఫ్యాన్స్ కి ఆన్సర్ చెయ్యలేము’.‘పవన్ కళ్యాణ్ గారూ.. గారూ ,ఆ రోజు సర్దార్ గబ్బర్ సింగ్ ను హిందీలో రిలీజ్ చెయ్యొద్దు వర్కవుట్ అవ్వదు, అని ఈ ట్రిట్టర్ సాక్షిగా ఎంత మొత్తుకున్నా మీరు వినలేదు.. ఫలితం చూసారు.

    pawan

    ఇప్పుడు మళ్లీ చెప్తున్నా .. భీమ్లా నాయక్ ఏ మాత్రం తగ్గకుండా పాన్ ఇండియా రిలీజ్ చెయ్యండి..పవర్ ప్రూవ్ చెయ్యండి’.‘అల్లు అర్జున్ గురించి నా ట్వీట్స్ అన్నీ నా వోడ్కా టైం లో పెట్టాను కానీ నేను ఇప్పుడు పెట్టిన ఈ ట్వీట్స్ నా కాఫీ టైం లో పెడుతున్నా. దీన్ని బట్టి నా సీరియస్ నెస్ ని అర్థం చేసుకోండి పవన్ కళ్యాణ్ గారూ’ అంటూ వరుసగా రామ్ గోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ చిత్రం గురించి ట్వీట్ల వర్షం కురిపించారు. ప్రస్తుతం వర్మ ఈ ట్వీట్స్ బాగా వైరల్ అవుతున్నాయి.

    Tags