OKtelugu MovieTime : మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ బాలీవుడ్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. టాలీవుడ్ యంగ్ బ్యూటీ ‘అనన్య నాగళ్ల’ తన హాట్ ఫోటోలతో సోషల్ మీడియా పై విరుచుకు పడింది. మొత్తానికి అనన్య అందాలకు కుర్రాళ్లు ఫిదా అవుతూ ‘నడుము చూపించి, చంపేస్తోంది సర్.. కేసు పెట్టండి’ అంటూ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. మల్లేశం, వకీల్ సాబ్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ‘అనన్య నాగళ్ల’ .. ప్రస్తుతం సినిమా ఛాన్స్ ల కోసం ఎదురుచూస్తోంది. అందుకే, ఎక్స్ పోజింగ్ లో మరో మెట్టు ఎదిగింది.
Also Read: పదో తరగతి అర్హతతో 1501 ఉద్యోగ ఖాళీలు.. ఎలా దరఖాస్తు చేయాలంటే?
ఇక మరో అప్ డేట్ విషయానికి వస్తే.. ఇక మాజీ హీరోయిన్ శ్రియ లీడ్ రోల్ లో వచ్చిన సినిమా ‘గమనం’. జనవరి 28 నుంచి ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో శ్రియ దివ్యాంగురాలి పాత్రలో నటించగా.. నిత్యా మేనన్ అతిథి పాత్రలో కనిపించారు. అన్నట్టు ప్రియాంక జవాల్కర్, శివ కందుకూరి ప్రధాన పాత్రల్లో సుజనా రావు తెరకెక్కించిన ఈ చిత్రం వాస్తవిక సంఘటనల ఆధారంగా.. మూడు కథలతో రూపొందింది.

మరో క్రేజీ అప్ డేట్ కి వస్తే.. కాజల్ పాటను ప్రభాస్ విడుదల చేయడం ఆసక్తి క్రియేట్ చేసింది. ప్రముఖ నృత్యదర్శకురాలు బృంద దర్శకత్వం వహిస్తున్న చిత్రం, ‘హేయ్ సినామికా’. మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్, కాజల్ అగర్వాల్ జంటగా, అదితిరావు హైదరీ కీలకపాత్రలో నటిస్తున్నారు.
Also Read: ఆ జిల్లాలోకి వెళ్లం.. విభజన తీరుపై మొదలైన లొల్లి
ఇటీవలే ఈ చిత్రం నుండి ‘ప్రాణం’ అనే సాంగ్‌ను రెబల్ స్టార్ ప్రభాస్ విడుదల చేశారు. గోవింద్ వసంత సంగీతం అందించగా బాగా ఆకట్టుకుంటోంది. దీనికి రాంబాబు గోసాల సాహిత్యం అందించారు. శరత్ సంతోష్ ఆలపించారు.
https://www.youtube.com/watch?v=pe1yUPX-6Vo
[…] Also Read: టాలీవుడ్ ప్రజెంట్ క్రేజీ మూవీ డేట్స… […]