OKtelugu MovieTime: మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ టాలీవుడ్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణించి 3 నెలలైనా ఆయనను మరిచిపోలేకపోతున్నారు ఫ్యాన్స్. పునీత్ చనిపోయేనాటికి రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. అందులో జేమ్స్ ఒకటి. తాజాగా ఈ సినిమా షూటింగ్‌ను టెక్నాలజీ సాయంతో పూర్తి చేయగా ఈనెల 11న ఉదయం 11.11 గంటలకు టీజర్ రిలీజ్ చేయనుంది చిత్రయూనిట్. దీంతో పునీత్ అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు. ఆయన చివరి సినిమా ఎలా ఉండబోతోందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక మరో అప్ డేట్ విషయానికి వస్తే.. బిగ్‌బాస్-5 కంటెస్టెంట్, యూట్యూబ్ స్టార్ సరయును బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హిందువుల విశ్వాసాలను దెబ్బతీసేలా సరయు ఓ వీడియోలో నటించిందంటూ ఆమెపై ఇప్పటికే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆ కేసు ఆధారంగా బంజారాహిల్స్ పోలీసులు సరయును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Also Read: మహిళా కానిస్టేబుళ్లకు జెంట్స్ టైలర్ తో కొలతలా?

అలాగే మరో అప్ డేట్ విషయానికి వస్తే.. బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ త్వరలోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. స్టార్ డైరెక్టర్ జోయా అక్తర్ డైరెక్షన్‌లో ఆమె తొలి చిత్రం చేయనుందట. తాజాగా సినిమాకు సంబంధించిన చర్చలు జరిపేందుకు జోయా ఆఫీస్‌కు సుహానా వెళ్లడం మీడియా కంట పడింది.

దీంతో ఆమె డెబ్యూపై బాలీవుడ్‌లో జోరుగా చర్చ జరుగుతోంది. అయితే తన కూతురు హీరోయిన్ అవ్వాలనుకుంటోందని షారుక్ గతంలో స్వయంగా వెల్లడించాడు.