Oh Bhama Ayyo Rama Teaser
Oh Bhama Ayyo Rama Teaser: ఒకప్పుడు కమెడియన్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్న సుహాస్??(Actor Suhas), ఆ తర్వాత హీరోగా మారి ఎన్నో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ, అత్యధిక సక్సెస్ రేట్ ఉన్న యంగ్ హీరోగా ఇండస్ట్రీ లో దూసుకుపోతున్నాడు. గత ఏడాది ఈయన హీరోగా నటించిన 5 సినిమాలు విడుదల అయ్యాయి. అందులో మూడు సూపర్ హిట్స్ గా నిలిచాయి. కానీ ఆయన గత చిత్రం ‘జనక అయితే గనక’ చిత్రం మాత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇది ఇలా ఉండగా రీసెంట్ గా ఆయన ‘ఓ భామ అయ్యో రామ'(O Bhama Ayyo Rama) అనే చిత్రం చేశాడు. షూటింగ్ కార్యక్రమాలు దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ సమ్మర్ లోనే థియేటర్స్ లోకి రానుంది. కాసేపటి క్రితమే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని విడుదల చేశారు.
Also Read: కన్నప్ప మూవీ పై ట్రోల్స్ చేస్తే సర్వ నాశనమైపోతారు – మూవీ టీం
ఈ టీజర్ ని చూసిన తర్వాత అమాయక చక్రవర్తి అయిన హీరో కి రౌడీ పెళ్ళాం వస్తే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తో తెరకెక్కించినట్టుగా అనిపించింది. ఇలాంటి కథలతో ఇది వరకు ఎన్నో సినిమాలు తెరకెక్కాయి. కానీ స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటే ఆడియన్స్ కచ్చితంగా ఎంటర్టైన్ అవుతారు. పైగా సుహాస్ ఒక సినిమా ఒప్పుకున్నాడంటే కచ్చితంగా అందులో ఎదో ఒక విశేషం ఉన్నట్టే అని ఆడియన్స్ ఫిక్స్ అయిపోతారు. ఈ టీజర్ ని చూసిన తర్వాత అదే అనిపించింది. హీరో అమాయకుడు అయితే, అతని క్యారక్టర్ నుండి ఎంత కామెడీ అయినా లాక్కోవచ్చు. ఇందులో ఆ కామెడీ ఎలిమెంట్స్ మిస్ అవ్వకుండా డైరెక్టర్ రామ్ చూసినట్టు గా అనిపించింది. ఇకపోతే ఈ చిత్రం లో హీరోయిన్ గా మాళవిక మనోజ్(Malavika Manoj) నటించింది. సింగర్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు తన గాత్రాన్ని అందించిన మాళవిక, ఈమధ్య హీరోయిన్ గా కూడా అలరిస్తుంది.
ఇది వరకు ఆమె తమిళం లో అనేక సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. తెలుగు లో ఈమెకు ఇదే మొదటి సినిమా. చూసేందుకు చాలా క్యూట్ లుక్స్ తో కనిపిస్తున్న ఈమె, నటన పరంగా కూడా ప్రేక్షకుల నుండి మార్కులు కొట్టేసింది. ఈ చిత్రం లో ఈమెది హీరోకంటే పవర్ ఫుల్ క్యారక్టర్ అవ్వడంతో, వీళ్లిద్దరి మధ్య జరిగే సంభాషణలు, సంఘటనలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేలా ఉన్నాయి. ఆద్యంతం వినోద భరితంగా అనిపించిన ఈ సినిమా, సుహాస్ కెరీర్ లో మరో సూపర్ హిట్ గా నిలుస్తుందో లేదో చూడాలి. ఈ టీజర్ పై మీరు కూడా ఒక లోక్ వేసి, మీ అభిప్రాయాలను తెలియజేయండి.