Health Tips: ఆహారం తినేటప్పుడు అన్నం, కూరలతోపాటు ఇతర పదార్థాలను కూడా చేర్చుకుంటూ ఉంటారు. కొందరు టేస్ట్ కోసం స్వీట్ కూడా ఏర్పాటు చేసుకుంటారు. అయితే అనేక రకాల పదార్థాలు ఒకేసారి తినడం వల్ల ఒక్కోసారి కడుపు ఉబ్బరంగా భార్య అవకాశం ఉంటుంది. అయితే ఈ సమస్య రాకుండా ఉండడానికి ఆహారం తినేటప్పుడు నిమ్మకాయ పిండుకుంటూ ఉంటారు. అయితే కొందరు కేవలం నాన్ వెజ్ ఉన్నప్పుడు మాత్రమే ఇలా చేస్తారు. వాస్తవానికి రోజు ఇలా నిమ్మకాయను పిండి ఆహారం తినడం మంచిదేనా?
నిమ్మకాయలో అనేక రకాల విటమిన్స్ ఉంటాయి. ఇందులో ప్రధానంగా సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఒక వ్యక్తి రోగనిరోధక శక్తి పెంచడానికి సి విటమిన్ ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా రక్తప్రసరణ మెరుగ్గా ఉండడానికి కూడా ఇది చాలావరకు సపోర్ట్ గా ఉంటుంది. అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి చర్మం ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడతాయి. నిమ్మకాయలో బి6 విటమిన్ తో పాటు పొటాషియం ఖనిజాలు ఉంటాయి.
ఆహారంలో ఐరన్ ఉంటుంది. అయితే సాధారణ ఆహారం తీసుకుంటే శరీరంలోకి వెళ్లి జీర్ణ క్రియ ద్వారా ఐరన్ బయటకు వెళ్తుంది. దీంతో శరీరానికి ఏ విధంగా ఉపయోగ ఉండదు. కానీ ఆహారం తినేటప్పుడు నిమ్మకాయ పిండుకుంటే ఆహారంలో ఉండే ఐరన్ కరిగిపోతుంది. దీంతో ఐరన్ తో పాటు నిమ్మకాయల ఉండే సి విటమి కూడా రక్తంలో కలిసిపోతుంది. ఇలా తొందరగా సి విటమిన్ రక్తంలో కలవడం వల్ల శరీరానికి ఉత్తేజాన్ని ఇస్తుంది. అంతేకాకుండా ఎలాంటి జీవన సమస్యలు లేకుండా చేస్తుంది. కొందరికి ఆహారం తినగానే కడుపు ఉబ్బరంగా కనిపిస్తుంది. ఈ సమస్య ఉన్నవారు ఆహారంలో నిమ్మకాయను చేర్చుకుంటే మరోసారి అటువంటి సమస్య ఉండదు.
అయితే ఆహారంలో నిమ్మకాయను పిండుకోవడం వల్ల ఆహారం రుచి కూడా పెరుగుతుంది. కొందరు ఆహారంలో కాకుండా భోజనం చేసిన తర్వాత కూడా సలాడ్ వంటివి తీసుకుంటూ ఉంటారు. ఇలా చేసినా ప్రయోజనకరంగానే ఉంటుంది. అంతేకాకుండా నిమ్మ రసం తీసుకోవడం వల్ల వేసవికాలంలో శరీరానికి డీహైడ్రేషన్ కాకుండా ఉంటుంది. ప్రతిరోజు ఏదో ఒక రూపంలో నిమ్మరసం తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి ఎలాంటి అనారోగ్యానికి గురికాకుండా ఉంటారు.
అయితే కొందరు కూర వండేటప్పుడు మాత్రమే నిమ్మకాయ పిండుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ఆహారం తినేటప్పుడు మాత్రమే దీనిని తీసుకోవడం వల్ల అనేక రకాల ప్రయోజనం ఉంటుంది. ఒకవేళ ఆహారంలో తీసుకోవడం ఇష్టం లేకపోతే భోజనం పూర్తయిన తర్వాత సలాడ్ రూపంలో కూడా తీసుకోవచ్చు. ఇలా కూడా సాధ్యం కాకపోతే భోజనం చేసిన 30 నిమిషాల తర్వాత నిమ్మరసం తీసుకున్నా.. ఉపయోగకరంగానే ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లోనైనా నిమ్మకాయ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది.