OG Premieres: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఇమేజ్ ముందు ఏ స్టార్ హీరో నిలబడలేకపోతున్నారనేది వాస్తవం…ఇక ఇప్పుడు ఆయన ఓజీ సినిమాతో పాన్ ఇండియా బాటపడుతున్నాడు. ఇంతకుముందు వచ్చిన ‘హరిహర వీరమల్లు’ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో ఇప్పుడు ‘ఓజీ’ సినిమాతో ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ని సాధించి పాన్ ఇండియాలో తన మార్కెట్ ని పెంచుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఫుల్ టైం పాలిటిక్స్ లోకి దిగినప్పటి నుంచి సినిమాల మీద పెద్దగా ఫోకస్ అయితే చేయడం లేదు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా తనపడవి బాధ్యతలను కొనసాగిస్తున్నాడు. కాబట్టి అతనికి సినిమాలు చేసే సమయం అయితే లేదు. అందువల్లే 2024 ఎలక్షన్స్ కి ముందు కమిట్ అయిన సినిమాలు మాత్రమే ఆయన ఫినిష్ చేస్తున్నాడు తప్ప కొత్త సినిమాలకు కమిట్ అవ్వడం లేదు… మరి ఇప్పుడు ఈ ఓజీ సినిమా ఈనెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో రెండు రోజుల ముందు నుంచే ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్స్ ని వేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక దానికి తగ్గట్టుగానే నిర్మాతలు సైతం దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.
అయితే మెయిన్ ఏరియాల్లో మాత్రమే ఈ ప్రీమియర్స్ ని వేయాలని చూస్తున్నారు. హైదరాబాద్, వైజాగ్ లాంటి ఏరియాల్లో మాత్రమే ఈ ప్రీమియర్స్ వేసే అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తున్నాయి. అది కూడా రెండు రోజులు మాత్రమే వేస్తారట. ఇక ఏది ఏమైనా కూడా ఓజీ ముందు ఏ రికార్డులు నిలబడవు అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
మరి ఈ సినిమా పవన్ కళ్యాణ్ తో పాటు తన అభిమానులు దాహాన్ని కూడా తీరుస్తుందా? పవన్ కళ్యాణ్ నుంచి భారీ హిట్ వచ్చి చాలా సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ సినిమా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… అయితే ప్రీమియర్స్ వేసే విషయంలో దర్శక నిర్మాతలు సుముఖంగా ఉన్నారు.
కాబట్టి గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్స్ తెచ్చుకొని షో స్ వేయడం ఒక్కటే బ్యాలెన్స్ ఇక ఆంధ్రాలో ఎలాగో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉంది కాబట్టి అక్కడ ఈజీగా పర్మిషన్స్ అయితే వస్తాయి. ఇక తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి పవన్ కళ్యాణ్ కి చాలా సన్నిహితంగా ఉంటాడు. కాబట్టి ఆయన కూడా పర్మిషన్ ఇచ్చే అవకాశాలైతే ఉన్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే పుష్ప 2 రిలీజ్ సమయంలో జరిగినటువంటి దుర్ఘటనలు జరగకుండా చాలా కేర్ ఫుల్ గా ఈ సినిమా ప్రీమియర్స్ అయితే వేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది…