Hari Hara Veeramallu : సుమారుగా ఐదేళ్ల నుండి సెట్స్ పై ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం ఎట్టకేలకు నిన్నటితో పూర్తి అయ్యింది. మేకర్స్ స్వయంగా ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేసారు. ఈ నెల 30న, లేదా జూన్ 12న ఈ చిత్రాన్ని విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు. నిర్మాత AM రత్నం ఈ సినిమాని జూన్ 12న విడుదల చేయాలని అనుకుంటున్నాడు. కానీ అందుకు అమెజాన్ ప్రైమ్ అనుమతి కావాల్సి ఉంది. ఎందుకంటే వాళ్ళతో కుదిరించుకున్న ఒప్పందం ప్రకారం కచ్చితంగా మే నెలలోనే విడుదల చేయాలి. అందుకే నేడు ముంబై లో అమెజాన్ ప్రైమ్ సంస్థ తో చర్చలు జరిపిన తర్వాత వాళ్ళు ఒప్పుకుంటే వచ్చే నెల 12 న విడుదల చేస్తారు. లేదంటే ఈ నెల 30న విడుదల చేస్తారు. సాయంత్రం లోపు ఈ సినిమా గురించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Also Read : అభిమానులను పిచ్చెక్కిస్తున్న ‘హరి హర వీరమల్లు’ టీం మౌనం..అసలు ఏమి జరుగుతుంది?
ఇదంతా పక్కన పెడితే ‘హరి హర వీరమల్లు’ సినిమాపై ఒకప్పుడు మామూలు క్రేజ్ ఉండేది కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇలాంటి జానర్ లో ఇప్పటి వరకు సినిమా చేయకపోవడం, ఆయన గెటప్స్ కూడా అదిరిపోవడం తో కచ్చితంగా ఈ చిత్రం ఇండస్ట్రీ రికార్డ్స్ బద్దలు కొడుతుంది అనే నమ్మకం అభిమానుల్లో వచ్చింది. కానీ సినిమా షూటింగ్ వివిధ కారణాల చేత ఆలస్యం అవుతూ రావడం వల్ల ఈ సినిమా మీదున్న హైప్ మొత్తం పోయింది. పైగా రీసెంట్ గా విడుదల చేసిన రెండు పాటలకు కూడా ఆడియన్స్ నుండి అంతంత మాత్రంగానే రెస్పాన్స్ వచ్చింది. ఒక అదిరిపోయే కంటెంట్ రావాలని, దాంతో హైప్ ఎక్కడికో వెళ్లిపోవాలని అభిమానులు ఎదురు చూస్తున్నారు. పాటల వల్ల ఆ హైప్ రాదని అందరికీ అర్థమైపోయింది. కాబట్టి కచ్చితంగా థియేట్రికల్ ట్రైలర్ ద్వారానే రావాలి, ఈ నెలలోనే ట్రైలర్ రాబోతుంది.
ఇదంతా పక్కన పెడితే ‘హరి హర వీరమల్లు’ చిత్రాన్ని మీరు ఇప్పుడు తక్కువ అంచనా వేయొచ్చు, కానీ విడుదల తర్వాత ఈ సినిమాని చూసిన ప్రతీ ఒక్కరు షాక్ కి గురి అవుతారని, ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఒక ట్విస్ట్ ఫ్యాన్స్, ఆడియన్సు మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తుందట. ఇంతకు ఏమిటి ఆ సన్నివేశం అనేది అర్థం కాక అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. అదే విధంగా క్లైమాక్స్ సన్నివేశం ఎంతో స్పెషల్ గా ఉంటుందట. ముఖ్యంగా రెండవ భాగానికి సంబంధించిన క్లిఫ్ హ్యాంగర్ సన్నివేశం 8 నిమిషాల పాటు ఉంటుందట. ఈ సన్నివేశం సినిమాని ఎక్కడికో తీసుకెళ్లి పెడుతుందట. అంత అద్భుతంగా డిజైన్ చేసారని అంటున్నారు. చూడాలి మరి ఇందులో ఎంత నిజం ఉంది అనేది. రీసెంట్ గానే తనకు సంబంధించిన పెండింగ్ వర్క్ ని పూర్తి చేసిన పవన్ కళ్యాణ్, ఈ వీకెండ్ లో డబ్బింగ్ కూడా పూర్తి చేయనున్నాడు.
Also Read : హరి హర వీరమల్లు’ కి హాలీవుడ్ హీరో ‘టామ్ క్రూజ్’ గండం..ఇలా అయితే కష్టమే!