Guns N’ Roses song in OG : పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఓజీ’ నుండి ఏ చిన్న కంటెంట్ బయటకు వచ్చినా అది ఆడియన్స్ కి తెగ నచ్చేస్తుంది. రీసెంట్ గానే విడుదల చేసిన ‘ది ట్రాన్స్ ఆఫ్ ఒమీ’ పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఒక విలన్ థీమ్ మ్యూజిక్ కి ఆ రేంజ్ రెస్పాన్స్ రావడం మన టాలీవుడ్ లో మొట్టమొదటిసారిగా ఈ చిత్రానికే జరిగింది. ఈ పాట చివర్లో వచ్చే ‘గన్స్ & రోజెస్’ మ్యూజిక్ బిట్ అయితే వేరే లెవెల్ లో క్లిక్ అయ్యింది. దీని ఫుల్ వెర్షన్ కోసం అభిమానులు చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నారు. నేడు మేకర్స్ కాసేపటి క్రితమే ఈ పాట ని విడుదల చేయగా, దీనికి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అసలు ఇది మన తెలుగు సినిమాలాగా అనిపించడం లేదు, హాలీవుడ్ రేంజ్ సినిమాని చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది అంటూ ప్రతీ ఒక్కరు కామెంట్స్ చేస్తున్నారు.
నిజంగా తమన్ ఆ రేంజ్ స్టాండర్డ్స్ తోనే ఈ చిత్రానికి సంగీతం ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. ఈరోజు విడుదలైన ‘గన్స్ & రోజెస్’ పాటకు కూడా అలాగే అనిపించింది. పాట ప్రారంభం లో ‘రైజ్ ఫర్ ది వారియర్..బోవ్ టు ది సేవియర్..లీడర్ ది కాంక్వేరేర్’ అంటూ సాగే లిరిక్స్ ఆడియన్స్ కి చాలా కొత్త రకమైన ఫీలింగ్ ని తెచ్చిపెట్టింది. అసలే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక ఈ సినిమా గురించి ఒక రేంజ్ హై లో ఉన్నారు. వాళ్లకు ఇలాంటి లిరిక్స్ పెడితే ఇంకా ఏమైనా ఉందా?, ముఖ్యంగా ఈ ఒక్క పాట లోనే మూడు రకాల వేరియేషన్స్ కనిపించాయి. ముఖ్యంగా ‘గన్స్ & రోజెస్’ థీమ్ నుండి ‘హంగ్రీ చీతా’ కి మారే ట్రాన్సిషన్ ఏదైతే ఉందో అభిమానులకు మెంటలెక్కిపోయేలా చేసింది.
సాధారణంగా తమన్ తన సినిమాల్లో పాటలకంటే ఎక్కువగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పైనే ఫోకస్ పెడుతాడు. ఆయన సినిమాల్లో ప్రత్యేకించి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. అలాంటిది ఈ సినిమాకు మొట్టమొదటిసారి ఆయన కంపోజ్ చేసిన పాటల గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు. పాటలకే ఈ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందంటే, ఇక సినిమాలో ఆయన ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని అందించి ఉంటాడో మీరే ఊహించుకోండి. సెప్టెంబర్ 25 న ఫ్యాన్స్ కి తమన్ తన మ్యూజిక్ తో సరికొత్త థియేట్రికల్ అనుభూతి కలిగిస్తాడని చెప్పొచ్చు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని ఈ నెల 18 న విడుదల చేయబోతున్నట్టు టాక్. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతుంది. అదే విధంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లో ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.
