OG movie screen damage: స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే చాలు ప్రేక్షకుల్లో ఎనలేని ఉత్సాహం ఉంటుంది. వీలైనంత తొందరగా ఆ సినిమాని చూసి ఎంజాయ్ చేయాలని ప్రతి ఒక్క ప్రేక్షకుడు కోరుకుంటూ ఉంటాడు. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాని అందరికంటే ముందే చూడటానికి చాలా మంది ఇష్టపడుతుంటారు. ఇక ఈ ప్రీమియర్ షో సినిమాని చూస్తే అది పవన్ కళ్యాణ్ కి వాళ్ళు ఇచ్చే గొప్ప గౌరవమని భావిస్తూ ఉంటారు. అందుకోసమే ‘స్టార్ హీరోల అభిమానుల యందు పవన్ కళ్యాణ్ అభిమానులు వేరయా’ అని చెబుతూ ఉంటారు. ఇక ఓజి సినిమా ఈరోజు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో నిన్న నైట్ నుంచి ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్స్ అయితే వేశారు. ఈ మూవీ చూడటానికి అభిమానులు ఓజీ టి షర్ట్స్ వేసుకొని, కర్చీఫ్ లు కట్టుకొని సినిమాని చూసి ఎంజాయ్ చేశారు.
ఇక కొంతమంది మాత్రం ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ వాడిన కత్తిని తీసుకొని వచ్చి సినిమాను చూసి స్క్రీన్ ని కూడా చించేశారు. నిజానికి పవన్ కళ్యాణ్ అభిమానులు సినిమా కోసం ఏదైనా చేస్తారు. స్క్రీన్ మీద ఆయన్ని చూడడానికి ఆసక్తి ని చూపిస్తారు.
అందుకే సినిమా టాక్ తో సంబంధం లేకుండా రెండు మూడు సార్లు అతని సినిమాలను చూసి సినిమా కలెక్షన్స్ ని పెంచడంలో పవన్ కళ్యాణ్ అభిమానులు కీలకపాత్ర వహిస్తూ ఉంటారు… ఇక థియేటర్ ని చింపివేయడం అనేది అసాంఘిక చర్య అలా చేయకూడదు అని కొంతమంది అంటున్నారు.
మరికొంతమంది మాత్రం పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద కనిపిస్తే ఫ్యాన్స్ ఆ ఊపులో ఏం చేస్తారో వాళ్లకు కూడా అర్థం కాదని వాళ్ళకి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు… ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ కి ఇచ్చిన ఎలివేషన్ అయితే మామూలుగా లేదు…లాంగ్ రన్ లో ఈ సినిమా ఎన్ని వందల కోట్లు వసూల్ చేస్తుందనేది తెలియాల్సి ఉంది…
‘OG’ సినిమా ప్రీమియర్స్ చూసేందుకు వచ్చి కత్తితో స్క్రీన్ చింపేసిన అభిమానులు
బెంగళూరులోని KR పురంలో ఘటన
దీంతో షో నిలిపివేసిన యాజమాన్యం pic.twitter.com/sLyepIeVdl
— Telugu Scribe (@TeluguScribe) September 25, 2025