OG Trailer Update: ఒక సినిమా కి ప్రేక్షకుడు థియేటర్ కి వెళ్లి చూడాలా వద్దా అని నిర్ణయించుకోవడానికి థియేట్రికల్ ట్రైలర్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈమధ్య కాలం లో ట్రైలర్ అద్భుతంగా ఉంటే చాలు, టాక్ తో సంబంధం లేకుండా కళ్ళు చెదిరే ఓపెనింగ్ వసూళ్లు వస్తున్నాయి. అందుకే మేకర్స్ ట్రైలర్ మీద ప్రత్యేక శ్రద్ద చూపిస్తున్నారు. అయితే ప్రస్తుతం టాలీవుడ్ ప్రేక్షకులు సెప్టెంబర్ 25 న విడుదల అవ్వబోయే ‘ఓజీ'(They Call Him OG) చిత్రం కోసం ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో మనమంతా చూస్తూనే ఉన్నాం. కానీ ఈ సినిమా నుండి ఇప్పటి వరకు స్టోరీ ని తెలిపే విధంగా, పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) క్యారక్టర్ ని తెలిపే విధంగా ఒక్క కంటెంట్ కూడా బయటకు రాలేదు. ఫ్యాన్స్ కి ఎప్పుడో రెండేళ్ల క్రితం విడుదల చేసిన గ్లింప్స్ వీడియో నే ఇప్పటికీ చూసుకోవాల్సి వస్తుంది. ఇప్పటి వరకు విడుదల చేసిన పాటలన్నీ పెద్ద హిట్ అయ్యాయి.
కానీ సాధారణ ఆడియన్స్ సినిమాకు వెళ్లాలా వద్ద అని నిర్ణయించుకునే ట్రైలర్ మాత్రం రాకపోవడం అభిమానులను కాస్త అసహనానికి గురి చేస్తుంది. మామూలుగా థియేట్రికల్ ట్రైలర్ ని ఈ నెల 18 వ తారీఖున విడుదల చేద్దామని అనుకున్నారు. కానీ ఇంకా కొన్ని పనులు బ్యాలన్స్ ఉండడం తో 19 న విడుదల చేస్తారు అనే టాక్ నడుస్తుంది. ఇప్పుడు ఈ రెండు తేదీలు కాకుండా, సెప్టెంబర్ 20న లేదా 21వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చెయ్యాలని చూస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన బయటకు రానుంది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఆదివారం నిర్వహించాలా? లేదా శనివారం నిర్వహించాలా అనే ఆలోచనలో ఉన్నారు. ముందుగా ఆంధ్ర ప్రదేశ్ లోని విజయవాడ లేదా వైజాగ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేద్దామని అనుకున్నారు.
కానీ ఎందుకో ఇప్పుడు ప్లాన్ హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యింది. యూసఫ్ గూడా పెరేడ్ గ్రౌండ్స్ లో ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చెయ్యాలని చూస్తున్నారు. ఇకపోతే సెన్సార్ కార్యక్రమాలు ఈరోజు జరగాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల రేపు ఉదయం 10 గంటల స్లాట్ లో సెన్సార్ కార్యక్రమాలు జరగబోతున్నాయి. సాధ్యమైనంత వరకు ఈ చిత్రానికి UA సర్టిఫికేట్ వస్తుందని అంతా అనుకుంటున్నారు. కానీ యాక్షన్ చిత్రం కాబట్టి A సర్టిఫికేట్ వచ్చినా రావొచ్చని అంటున్నారు. ఒక్కసారి సెన్సార్ అయ్యిందంటే చాలు, సోషల్ మీడియా లో సినిమాకు సంబంధించిన టాక్ వచ్చేస్తుంది. కాబట్టి రేపు మొత్తం సోషల్ మీడియా ఓజీ మూవీ సెన్సార్ టాక్ తో కళకళలాడబోతుంది అన్నమాట.